Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు షాక్.. డెబిట్ కార్డుపై ఛార్జీల మోత..!

Kotak Mahindra Bank Debit Card Charges: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. డెబిట్ కార్డుతోపాటు అన్ని రకాల ఛార్జీలను పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డు ఛార్జీలను ఏడాదికి రూ.60 పెంచగా.. మే 22వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 30, 2023, 01:42 PM IST
Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు షాక్.. డెబిట్ కార్డుపై ఛార్జీల మోత..!

Kotak Mahindra Bank Debit Card Charges: ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటాక్ మహీంద్రా డెబిట్ కార్డ్ ఛార్జీలను పెంచింది. ఏడాదికి డెబిట్ కార్డ్ ఛార్జీలను 60 రూపాయలు పెంచింది. దీంతో గతంలో రూ.199+జీఎస్టీ ఉండగా.. పెంచిన ఛార్జీలతో రూ.259+జీఎస్టీకి చేరింది. ఈ పెంపు మే 22 నుంచి అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన కస్టమర్లకు మెయిల్ ఛార్జీలు పెంచుతూ మెయిల్ చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్స్, డెబిట్ కార్డులు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పెంచిన ఈ ఛార్జీలు అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తుందని వెల్లడించింది. ఇది అకౌంట్ రకం, లిమిట్, ఫీచర్లను బట్టి వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది.  

2022, జూన్ 1 నుంచి సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్లపై ఛార్జీలు ఇలా..

కోటక్ మహీంద్రా కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే.. 6 శాతం ఛార్జీ లేదా గరిష్టంగా ప్రొడక్ట్ వేరియంట్‌పై రూ.500 లేదా 600 వరకు వసూలు చేయనుంది. అదే ఆర్థిక కారణాలతో కాకుండా ఇతర రీజన్స్‌తో చెక్ ఇష్యూ, రిటర్న్స్‌కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే.. 50 రూపాయల ఛార్జీ వసూలు చేస్తోంది. స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్ అయితే రూ.200 ఫీజు ఉంటుంది. చెక్ డిపాజిట్, రిటర్న్ లావాదేవీలపై రూ.200 ఛార్జీ వసూలు చేస్తోంది. అదేవిధంగా చెక్‌బుక్‌కు రూ.25 రుసుము కూడా వసూలు చేస్తారు. 

ఒక వేళ కార్డు చోరీకి గురైనా.. పోగొట్టుకున్నా.. రూ.200 ఛార్జీ విధిస్తారు. ఏటీఎమ్ మెషీన్‌లో తక్కువ బ్యాలెన్స్ కారణంగా లావాదేవీని రిజెక్ట్ అయితే.. అప్పుడు రూ.25 ఛార్జీ ఉంటుంది. కార్డ్‌లెస్ నగదు లావాదేవీపై ఒక నెలలో ఒక ఉపసంహరణ ఉచితంగా ఉంటుంది. మిగిలిన వాటికి రూ.10 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 

ఇటీవల రెపో రేటును యాథాతథంగా ఉంచుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ కాలవ్యవధులపై గరిష్టంగా 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలలోపు ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.50 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.2 కోట్లలోపు ఉన్న ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది.

Also Read:  ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!  

Also Read: Punjab Gas Leak: ఘోర విషాదం.. పంజాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 9 మంది మృతి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News