Virupaksha Movie Collection ఈ వీకెండ్‌కు మూడు సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. అఖిల్ ఏజెంట్, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలు ఆప్షన్స్‌గా ఉన్నాయి. ఇందులో విరూపాక్ష సినిమా గత వారం వచ్చి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్‌లు రెండ్రోజుల క్రితం విడుదలయ్యాయి. డిజాస్టర్ టాక్, మిక్స్డ్ టాక్‌లతో కలెక్షన్ల విషయంలో వెనకపడ్డాయి ఆ రెండు చిత్రాలు.
అఖిల్ ఏజెంట్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అఖిల్ లుక్స్, యాక్షన్ మెప్పించినా, కథ, కథనాలు లేకపోవడంతో జనాలు రిసీవ్ చేసుకోవడం లేదు. ఈ సినిమాను జనాలు ఆదరించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకునేలా ఉంది. సమంత శాకుంతలం సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. రెండో రోజూ అన్ని చోట్లా థియేటర్లు ఖాళీగా మిగిలాయి. ఏజెంట్ పరిస్థితి కూడా అలానే అయింది.
పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో రెండో పార్ట్ మీద ఎవ్వరికీ ఏ అంచనాలు లేకుండా పోయాయి. ఈ సినిమా థియేటర్లోకి వచ్చినా కూడా ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేయలేకపోయింది. మొదటి ఆట తరువాత కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. నటీనటుల పర్ఫామన్స్, త్రిష, ఐష్, విక్రమ్, కార్తీ పర్ఫామెన్స్ పట్ల కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓ మాదిరిగా కలెక్షన్లు వస్తున్నాయి.
Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్
అయితే శనివారం నాటి కలెక్షన్లను లెక్కలోకి తీస్తే.. ఇంచుమించుగా విరూపాక్ష అన్ని సినిమాలకంటే ముందంజలో ఉంది. ఇక అఖిల్ ఏజెంట్ సినిమాకు తక్కువ కలెక్షన్లు వచ్చాయి. పొన్నియిన్ సెల్వన్ 2కి పర్వాలేదనిపించేలా వసూళ్లు వచ్చాయి. రెండో రోజు ఏజెంట్‌కు 0.67 కోట్లు, పొన్నియిన్ సెల్వన్ 2కి రెండో రోజు 1.58 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఏజెంట్ కంటే డబుల్ కొల్లగొట్టినట్టే. అయితే విరూపాక్ష మాత్రం ఈ రెండు సినిమాల కంటే ఎక్కువగా కలెక్ట్ చేసింది. విరూపాక్షకు తొమ్మిదో రోజు అయినా కూడా 1.84 కోట్ల షేర్ వచ్చినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
Also Read: Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook