Weight Loss Tips: ఇటీవలి కాలంలో స్థూలకాయం పెను సమస్యగా మారింది. ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాయామం చేసేందుకు సమయం లేనందున బరువు పెరిగిపోతున్నారు. క్రమంగా ఇది స్థూలకాయానికి దారితీస్తోంది. ఆహారపు అలవాట్లలో మార్పుతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
రోజురోజుకూ పెరుగుతున్న బరువు ప్రతి ఒక్కరికీ సమస్యగా మారుతోంది. స్థూలకాయం నుంచి విముక్తం పొందేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సరైన డైట్ పాటిస్తే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. సాయంత్రం వేళల్లో హెవీ స్నాక్స్ తీసుకునే అలవాటుంటే..స్థూలకాయం సులభంగా వచ్చేస్తుంది. అయితే బరువు తగ్గించేందుకు కొన్ని సీడ్స్ తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది.
ఫ్లక్స్ సీడ్స్
ఫ్లక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కొవ్వును చాలా వేగంగా కరిగిస్తాయి. ఫ్లక్స్ సీడ్స్‌లో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బరువు తగ్గించేందుకు ఫ్లక్స్ సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.
సన్‌ఫ్లవర్ సీడ్స్
బరువు తగ్గించేందుకు సన్‌ఫ్లవర్ సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. దీనికోసం సలాడ్ లేదా సూప్‌లో కలుపుకుని తినవచ్చు. విటమిన్ ఇ పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరంలోని కేలరీలు కూడా సులభంగా కరుగుతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో దోహదపడుతుంది.
చియా సీడ్స్
చియా సీడ్స్ రోజూ తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు. చియా సీడ్స్ కారణంగా ఆకలి తగ్గుతుంది. ఆకలి ఎప్పుడైతే తగ్గిందో క్రమంగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. చియా సీడ్స్‌ను నీళ్లలో కాస్సేపు నానబెట్టి ప్రతి రోజూ పరగడుపున లేదా మద్యాహ్నం భోజనానికి ముందు తీసుకోవల్సి వస్తుంది. మలబద్ధకం సమస్యకు చియా సీడ్స్ అద్భుత పరిష్కారం.
Also read: Garlic Benefits: రోజూ పరగడుపున తేనెతో కలిపి తీసుకుంటే నమ్మశక్యం కాని ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook