Liver Inflammation: మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. ఈ అవయవం శరీరం పనిచేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం చాలామందిలో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఆధునిక జీవనశైలి ధూమపానం, మద్యపాన అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కాలేయం దెబ్బతినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధిగా మారవచ్చు.
అంతేకాకుండా చాలామందిలో ఒత్తిడి కారణంగా కూడా కాలేయ సమస్యలు వస్తున్నాయని ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి తరచుగా మద్యపానం చేసేవారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కావాల్సి వస్తే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, మద్యపానం సేవించడం మానుకోవాల్సి ఉంటుంది.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
కాలేయం సమస్యల కారణంగా చాలామందిలో శరీరం తీవ్రంగా దెబ్బతింటుంది. కాకుండా కాలేయం వాపులకు కూడా గురవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద ని పనులు సూచించిన ఈ రసాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. రసాన్ని తాగడం వల్ల వాపు తగ్గడమే కాకుండా శరీరంలోని వ్యర్ధపదార్థాలు కూడా సులభంగా బయటకు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాలేయం వాపును తగ్గించే రసం ఇదే:
రసానికి కావాల్సిన పదార్థాలు:
- ఒక కప్పు సొరకాయ ముక్కలు
- ఒక కప్పు కొత్తిమీర
- ఒక టీ స్పూన్ నిమ్మరసం
- రుచికి కావాల్సినంత ఉప్పు
- ఒక టీ స్పూన్ పసుపు
రసం తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు సొరకాయ ముక్కలను తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మిశ్రమంల తయారు చేసుకోవాలి. అందులోనే ఒక కప్పు కొత్తిమీర, ఒక టీ స్పూన్ పసుపు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఫైన్ గా జ్యూస్ లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న రసాన్ని కాటన్ గుడ్డతో వడకట్టుకొని గ్లాసులో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం జోడించి తగినంత ఉప్పు వేసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook