How To Write Professional Mail: ప్రస్తుతం చాలా మందికి ఈమెయిల్ ఉన్నా.. అవతలి వ్యక్తికి హుందాగా ఎలా మెయిల్ పంపించాలో తెలియదు. జాబ్ కోసం హెచ్ఆర్కు మెయిల్ చేయాలన్నా.. ఏదైనా విషయంపై అడిగేందుకు మేనేజర్లకు సందేశం పంపించాలన్నా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జాబ్ అప్డేట్స్ కంపెనీకి ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా ఒక్కోసారి రిప్లై కూడా రాదు. అందుకే మీరు మెయిల్ రాసేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలే కదా అని నెగ్లెట్ చేయకుండా.. జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పంపించిన మెయిల్‌ను చూసుకుని అవతలి వ్యక్తి నవ్వుకుంటారు. మెయిల్ పంపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ తప్పులు చేయకూడదు..? పూర్తి వివరాలు ఇలా..
==> మనం ఎవరితో కమ్యూనికేషన్ మొదలు పెట్టినా.. గ్రీటింగ్స్ చెప్పడం చాలా ముఖ్యం. హాయ్ లేదా హలోతో నేరుగా రాయడం ప్రారంభించండి.
==> వృత్తిపరంగా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పండి. మీ మెయిల్ షార్ట్‌గా.. పాయింట్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి.
==> మీ మెయిల్లోని సబ్జెక్ట్ లైన్ మీ టాపిక్‌కి కనెక్ట్ అయి ఉండాలి. మెయిల్ చూసే వ్యక్తి.. సబ్జెక్ట్‌ను బట్టి ఆ మెయిల్ ఏ టాపిక్ మీద ఉందో అర్థం చేసుకోవచ్చు.
==> మీరు మెయిల్ రాసేటప్పుడు అనవసరమైన విరామ చిహ్నాలను పెట్టకండి. అసంపూర్ణ వాక్యాలు, అవసరం లేని చోట సింబల్స్ పెట్టడం వంటి తప్పులు చేయకండి.
==> మెయిల్ పంపే ముందు.. మీరు రాసిన స్క్రిప్ట్‌లో స్పెల్లింగ్ లేదా గ్రామర్ మిస్టెక్స్ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ఆన్లైన్ స్పెల్లింగ్, వ్యాకరణ చెకింగ్ టూల్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.
==> ఇది కాకుండా, మీరు ఫోటోను పంపినప్పుడల్లా, మీరు దాని ఫైల్ పేరు మార్చాలని గమనించాలి. ఇది రిసీవర్‌కు సులభతరం చేస్తుంది.
==> ప్రొఫెషనల్ మెయిల్లో ఎమోటికాన్లను అస్సలు ఉపయోగించవద్దు. ఇది కాకుండా మీకు ఏదైనా మెయిల్ వస్తే.. 24 నుంచి 28 గంటలలోపు సమాధానం ఇవ్వాలి. అలా అయితే అవతలి వ్యక్తి నుంచి త్వరగా ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హఠాన్మరణం.. కారణం ఇదే..!
Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి