Vivo V17, S17t, S17 Pro Launch in India: వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో విక్రయాల ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన Vivo S17 సిరీస్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. దీంతో ఒక్కసారిగా వివో విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరంలో ఒప్పోలో భారీగా సేలైన Vivo S17, Vivo S17t, Vivo S17 ప్రో స్మార్ట్ ఫోన్ల కంటే..ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన S17, S17t, Pro స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో కొత్త కొత్త స్పెసిఫికేషన్‌లు వచ్చినట్లు సమాచారం. ఈ S17 మోడల్స్ అందించిన స్మార్ట్ ఫోన్ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
S17tలో శక్తివంతమైన ప్రాసెసర్ :
వివో ఎస్17టీ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో వస్తోంది. అయితే ఈ ప్రాసెసర్‌తో మొట్టమొదటి సారిగా మార్కెట్‌లోకి వివో తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్పెసిఫికేషన్‌లు S17 మాదిరిగానే ఉన్నప్పటికీ రెండు ఫోన్‌లలో డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C పోర్ట్ వంటి కొత్త ఫీచర్లు అదనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
S17 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లలో వెనుక డిజైన్ కోసం కంపెనీ పార్టికల్ ఇంక్ అనే కొత్త టెక్నాలజీని వినియోగించి రూపొందించింది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 15 మిలియన్ల అయస్కాంత కణాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌కుయ సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
వివో S17 సిరీస్ ఫీచర్లు:
✺ 2800x1260 పిక్సెల్ డిస్ప్లే
✺ 800000:1 కాంట్రాస్ట్ రేషియో
✺ 120Hz రిఫ్రెష్ రేట్
✺ 6.78-అంగుళాల కర్వ్డ్-ఎడ్జ్ AMOLED డిస్‌ప్లే
✺ 186 గ్రాములుబరువు
✺ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ ప్రాసెసర్
✺ Snapdragon 870 ప్రాసెసర్
✺ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
✺ 4505mAh బ్యాటరీ
✺ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
✺ డ్యూయల్ సాఫ్ట్-LED ఫ్లాష్ సెట్‌అప్
✺ 50-మెగాపిక్సెల్ కెమెరా
✺ 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా-వైడ్ లెన్స్
✺ LED ఫ్లాష్
✺ 4K వీడియోని క్యాప్చర్
Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Vivo v17 Pro: డెడ్ ఛీప్ ధరల్లో Vivo 5G స్మార్ట్ ఫోన్స్.. కొత్త ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!