Odisha Train Accident Latest News: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1000 మందిపైగా గాయపడ్డారు. ఈ మృత్యుఘోషతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక చిన్న పొరపాటు వందలాది మంది మృతికి కారణమైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన రైళ్ల ప్రయాణం అంటే భయపడేలా చేసింది. మెయిన్ లైన్ నుంచి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై ఉన్నత కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేస్తామని వెల్లడించింది. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరో రూ.2 లక్షల పరిహారం కూడా అందజేస్తామని తెలిపింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నారు. గాయపడిన వారందరికీ పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా రూ.50 వేలు సాయం చేయనున్నారు.
ఇప్పుడు రైలులో ప్రయాణించే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైలులో ఎంత లగేజీని తీసుకువెళ్లవచ్చో మీకు తెలుసా..? చాలా మంది ఒకేసారి భారీగా లకేజీని ట్రైన్లో తీసుకువెళ్లడం మనం చూస్తుంటాం. అయితే 50 కేజీల కంటే ఎక్కువ తీసుకువెళితే.. టీటీ ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. ఒక ప్రయాణికుడు తనతో పాటు 50 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇంతకంటే ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణిస్తే.. ఛార్జీలు చెల్లించాల్సిందే. అదనపు లగేజీ కోసం ప్రత్యేకంగా టికెట్ కూడా తీసుకోవాలి.
Also Read: Odisha Train Accident News: 316 మంది ఏపీ వాసులు సేఫ్.. ఆ 141 మంది కోసం సెర్చింగ్
అయితే ఏసీ కోచ్‌లో లగేజీని తీసుకెళ్లడానికి నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఏసీ కోచ్‌లలో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా 70 కిలోల వరకు ఒక ప్రయాణికుడు లగేజీని తీసుకెళ్లవచ్చు. కానీ స్లీపర్ కోచ్‌లో ఒక వ్యక్తి తనతో పాటు 40 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లేందుకు నిబంధనలు ఉన్నాయి. ప్రయాణికులు తమతో పాటు ఎక్కువ లగేజీని తీసుకువెళితే.. కనీసం రూ.30 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ లగేజీ ఉంటే ప్రయాణికులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు భారీ వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి