Cricket Australia Picks WTC Team Of The Tournament ahead of WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బుధవారం (జూన్ 7) నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నాయి. ఆసీస్, భారత్ జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న కారణంగా మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ నేపథ్యంలో గత రెండేళ్లలో (2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో కూడిన తమ జట్టుని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.
క్రికెట్ ఆస్ట్రేలియా తమ డబ్ల్యూటీసీ జట్టుకు (టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్) పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఓపెనర్లుగా ఉన్మాన్ ఖవాజా, డిమిత్ కరుణరత్నెలను ఎంచుకుంది. మూడో స్థానంలో బాబర్ అజామ్‌కు చోటివ్వగా.. నాలుగో స్థానంలో జో రూట్‌కు అవకాశం ఇచ్చింది. ట్రావిస్ హెడ్‌ను ఐదో స్థానంలో తీసుకోగా.. రిషభ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకుంది. 2022 డిసెంబర్ 30న పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. అతడు ప్రస్తుతం మైదానంలోకి దిగడం లేదు. ఐపీఎల్ 2023కి దూరంగా ఉన్న పంత్.. అంతకుముందు అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.
ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్, కగిసో రబాడలను క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకుంది. స్పిన్ విభాగంలో భారత స్టార్స్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు సీఏ చోటు కల్పించింది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారాలవంటి భారత బ్యాటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా చోటివ్వలేదు. మొత్తంగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటిచ్చింది. సీఏ నలుగురు ఆసీస్ ఆటగాళ్లకు అవకాశం ఇచింది.
క్రికెట్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్:
ఉస్మాన్ ఖవాజా, డిమిత్ కరుణరత్నె, బాబర్ అజామ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ.
Also Read: WTC Final 2023: శుభ్‌మన్ గిల్‌కు ఆ బంతులనే సంధించాలి.. ఆసీస్ బౌలర్లకు ఛాపెల్ సూచనలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.