Railway Latest Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైల్వే శాఖలలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు శాఖలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 30 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ఇలా..
తాజా నోటిఫికేషన్ ద్వారా హర్యాణాలోని గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీర్ (సివిల్) విభాగంలో 30 పోస్టులు ఖాళీ ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత వారు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొంది. అర్హత కలిగి వారు, సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే అభ్యర్థులు వయసు వయస్సు 32 ఏళ్లకు మించకుండా ఉండాలని చెప్పారు.
ఈ పోస్టులకు అర్హత, ఆసక్తికలిగిన వారు ఆన్లైన్లో ఈ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.600 కాగా.. ఎస్సీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 300 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలని తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుందన్నారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి నెల నుంచే రూ.40 వేల నుంచి 1,40,000 రూపాయల వరకు శాలరీ పొందుతారు. ఈ జీతానికి ఇతర అలవెన్సులు అదనం. పూర్తి సమాచారం కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. గతంలో ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసిన నోటికేషన్‌కు అభ్యర్థులను భారీ స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో గుర్తుతెలియని లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయకండి. అధికారిక వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి.
Also Read: Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook