Skin Care Tips: ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడే సాధనం నిమ్మకాయ. నిమ్మతో ఆరోగ్యానికే కాదు..చర్మ, కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. చర్మాన్ని, కేశాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మరసం ఔషధంలా పనిచేస్తుంది.
శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు బాహ్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఈ కోవకే చెందుతాయి. చర్మాన్ని, కేశాల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేకుంటే ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. చర్మం రంగు నిగారింపు కోల్పోతుంది. చాలామందిలో ఉండే కలర్ కాంప్లెసిటీని పూర్తిగా దూరం చేయలేకపోయినా చాలావరకూ మెరుగుపర్చవచ్చంటున్నారు. పుట్టుకతో వచ్చిన చర్మం రంగును పూర్తిగా మార్చలేకపోయినా కొన్ని చిట్కాలు పాటిస్తే కచ్చితంగా చర్మం రంగు తేలుతుంది. నిగారింపు స్పష్టంగా కన్పిస్తుంది. అంతేకాకుండా కేశాల్ని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఈ అన్ని సమస్యలకు సమాధానం నిమ్మరసం. నిమ్మరసాన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం..
నిమ్మ-బియ్యం పిండి
నిమ్మరసంలో బియ్యం పిండి కలిపి రాయడం వల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా నిగనిగలాడుతుంది. దీనికోసం ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకుని ఇందులో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే 3-4 వారాల్లో ఫలితం కన్పిస్తుంది.
నిమ్మ-గ్రీన్ టీ
నిమ్మరసంలో గ్రీన్ టీ కలిపి ముఖానికి రాయడం మరో పద్ధతి. దీనికోసం ఓ కప్పు గ్రీన్‌లో కొద్దిగా నిమ్మరసం, విటమిన్ ఇ క్యాప్సూల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. 5-10 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ కాకపోయినా వారానికి 4-5 సార్లు చేస్తే 3-4 వారాల్లోనే సరైన ఫలితాలు కన్పిస్తాయి.
నిమ్మ-పంచదార
నిమ్మ రసంలో పంచదార కలిపి ముఖానికి రాయడం ఇంకో విధానం. ఒక స్పూన్ పంచదార తీసుకుని అందులో అల్లోవెరా జెల్, నిమ్మరసం కొద్దిగా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆ తరువాత చేత్తో నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. 10 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Also read: Skin Care Tips: ముఖంపై ముడతలు మాయం కావాలంటే ఈ పదార్ధాలు మానేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook