Healthy Foods: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి మలబద్ధకం. మలబద్ధకం ఒక్క సమస్యే ఎన్నో ఇతర సమస్యలకు కారణమౌతోంది. జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు సహజంగానే మలబద్ధకం సమస్య వస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనే వివరాలు పరిశీలిద్దాం..
బిజీ లైఫ్ కారణంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌పై ఎక్కువగా ఆధారపడటంతో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో ముఖ్యమైంది మలబద్ధకం సమస్య. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకుంటే ఈ సమస్య తీరిపోతుంది. ఎందుకంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే మలబద్ధకం సమస్య దానంతటదే తగ్గిపోతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి ఫైబర్ ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఆపిల్ ఫ్రూట్స్
ఆపిల్ పండ్లలో ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది. ఇందులో లిక్విఫైడ్ ఫైబర్ ఉండటంతో ఆపిల్ ప్రేవుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే పేక్టిన్ అనే కారణంగా జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పడుతుంది. అందుకే వైద్యులు కూడా ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు.
ఓట్స్
జీర్ణ సంబంధిత సమస్యలు కొంతమందికి తీవ్రంగా ఉంటాయి. ఈ సమస్య పరిష్కరించాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. ఓట్స్ అనేది లిక్విఫైడ్ ఫైబర్. ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ తినడం వల్ల మలం మృదువుగా మారి..మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. ఫైబర్ ఫుడ్స్ ప్రేవుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓట్స్ అనేది కేవలం మలబద్ధకం సమస్యకే కాకుండా డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది.
మసూర్ దాల్
ఫైబర్ ఫుడ్స్‌లో మసూర్ దాల్ చాలా ముఖ్యమైంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు రోజుకొకసారి మసూర్ దాల్ తప్పకుండా తినాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం దూరమౌతుంది. ఎందుకంటే మసూర్ దాల్‌లో కూడా లిక్విఫైడ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
బ్రోకలీ
జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు అవసరమైన మరో అద్భుతమైన పదార్ధం బ్రోకలి. వాస్తవానికి అకుపచ్చ కూరగాయలు ఏవైనా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎందుకంటే కూరగాయల్లో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు వారానికి 3-4 సార్లు తినడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోవడమే కాకుండా..ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.
చియా సీడ్స్
ఇక మలబద్ధకం సమస్యకు, అజీర్తికి పరిష్కారం చియా సీడ్స్. చియా సీడ్స్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొలెస్ట్రాల్ సమస్యకు, డయాబెటిస్ సమస్యకు, అధిక రక్తపోటుకు అద్భుతమైన పరిష్కారమార్గంగా చియా సీడ్స్ పనిచేస్తాయి. చియా సీడ్స్‌లో లిక్విఫైడ్ ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. రోజూ ఓ అరగంట నీళ్లలో నానబెట్టి కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే మెరుగైన ఫలితాలుంటాయి.
Also read: Diabetes Facts: ఆందోళన రేపుతున్న మధుమేహం, ఈ 10 లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook