Beetroot Juice Helps White Hair to Black Hair: వేసవిలో జుట్టులో చెమట పట్టడం కారణంగా చాలామందిలో రకరకాల జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా జుట్టు బలహీనపడడం, జుట్టు అంద హీనంగా తయారవడం, తెల్ల జుట్టు రావడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎండా కారణంగా మీరు కూడా జుట్టు సమస్యల బారిన పడితే తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రెమెడీస్ ని వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల జుట్టు దృఢంగా కాంతివంతంగా తయారవుతుందని ఆయుర్వేద చెబుతున్నారు. ఎండాకాలంలో జుట్టుని సంరక్షించే ఆయుర్వేద చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టును సంరక్షించేందుకు ఉసిరి రసం ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రసం గొప్ప ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో? ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
❉ ఒక కప్పు ఉసిరి రసం
❉ ఒక కప్పు బీట్‌రూట్ రసం
❉ రోజ్మేరీ ఆకులు
❉ కరివేపాకు రసం
❉ కొత్తిమీర ఆకు రసం
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
తయారీ పద్ధతి:
❉ ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
❉ ఆ కప్పులు ఒక కప్పు ఉసిరి రసం, ఒక కప్పు బీట్‌రూట్ రసం పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
❉ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రోజు మేరీ ఆకులను నానబెట్టి వాటి నుంచి వచ్చిన నీటిని కప్పులో వాటిని కూడా మిక్స్ చేయాలి.
❉ ఇలా మూడింటిని మిక్స్ చేసిన తర్వాత.. కరివేపాకు రసం, కొత్తిమీర ఆకు రసం వీటిని కూడా బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి.
❉ అంతే సులభంగా జుట్టును దృఢంగా చేసే రసం తయారు అయినట్లే..
జుట్టుకు అప్లై చేసే పద్ధతి:
❉ ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేసే ముందు రోజు తలస్నానం చేయాల్సి ఉంటుంది.
❉ ఇలా చేసిన తర్వాత ఉదయం స్నానం చేసే మూడు గంటల ముందు ఈ రసాన్ని జుట్టుకు పట్టించాలి.
❉ ఈ రసాన్ని పట్టించిన తర్వాత రెండు గంటల పాటు జుట్టు ఆరనివ్వాలి.
❉ ఇలా జుట్టు మొత్తం ఆరిన తర్వాత చల్లని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
❉ క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు దృఢంగా, తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి