ESIC Scheme: ఈఎస్‌ఐసీ కింద భారీగా సభ్యులు నమోదు.. ఏప్రిల్‌లో 17.88 లక్షల మంది చేరిక

ESI Scheme Latest Updates: ఏప్రిల్ నెలలో భారీగా కొత్త ఉద్యోగాల్లో చేరారు. ఈ ఒక్క నెలలో 17.88 లక్షల మంది ఈఎస్‌ఐసీ సభ్యులుగా చేరారు. వీరిలో ఎక్కువ శాతం మంది 25 ఏళ్లలోపే ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 10:46 AM IST
ESIC Scheme: ఈఎస్‌ఐసీ కింద భారీగా సభ్యులు నమోదు.. ఏప్రిల్‌లో 17.88 లక్షల మంది చేరిక

ESI Scheme Latest Updates: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) కింద పేర్లు నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏప్రిల్ నెలలోనే 17.88 లక్షల మంది కొత్త సభ్యులు జాయిన్ అయ్యారు. కొత్త సభ్యులకు సంబంధించి ప్రాథమిక పేరోల్ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో దాదాపు 30,249 కొత్త సంస్థలు ఈసీఎస్‌ కింద నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఉద్యోగులు అందరూ సామాజిక భద్రతా నెట్‌వర్క్‌లోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.

కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య పథకంగా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ)ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 3 కోట్ల కంటే ఎక్కువ మందికి బీమా కవర్ చేస్తోంది. ఏప్రిల్‌లో యువతకు మరిన్ని ఉద్యోగాలు సృష్టించడంతో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద చేరిన వారి సంఖ్య పెరిగింది. కొత్తగా చేరిన 17.88 లక్షల మంది ఉద్యోగుల్లో 8.37 లక్షల మంది 25 ఏళ్లలోపు వారే ఉండడంతో విశేషం. మొత్తం కొత్త ఉద్యోగుల్లో ఇది 47 శాతంగా ఉంది.

ఈఎస్‌ఐ కింద చేరిన ఉద్యోగులకు ఉచిత చికిత్స అందుతుంది. ఈ స్కీమ్‌లో బీమా నమోదు చేసుకున్న వ్యక్తితోపాటు అతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా ఉచిత చికిత్స అందిస్తారు. ఇందులో ట్రీట్‌మెంట్‌ ఖర్చుపై గరిష్ట పరిమితి ఉండదు. అదే హెల్త్ ఇన్సురెన్స్‌లో అయితే కొంత లిమిట్ ఉంటుంది. ఈఎస్‌ఐ ద్వారా ప్రసూతి సెలవుల ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. 

మహిళా ఉద్యోగులు డెలివరీ సమయంలో 26 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. గర్భస్రావం జరిగినప్పుడు ఆరు వారాల శాలరీలో 100 శాతం చెల్లిస్తారు. విధులు నిర్వహించే సమయంలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే.. ఆ వ్యక్తి అంత్యక్రియలకు గరిష్టంగా రూ.10 వేలు ఈఎస్‌ఐసీ ద్వారా అందిస్తారు. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి నెలవారీ పెన్షన్ కూడా అందుతుంది.

Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన  

Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News