Hair fall Control Tips: ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలిపోవడం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా ఉంటుంది. జట్టు రాలిపోవడానికి ఎన్నో రకాలు కారణాలు ఉంటాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, సరైన జీవనశైలిని అలవరచుకోలేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. విటమిన్ సి, జింక్, ఐరన్.. ఈ మూడు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా వరకు జట్టు రాలిపోవడాన్ని తగ్గించవచ్చు.
ఉసిరి, నారింజ, బత్తాయి, నిమ్మ మరియు జామ వంటి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సీపుడ్, మాంసం, వేరుశెనగలు మరియు డార్క్ చాక్లెట్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఆకు కూరలు, గుడ్లు, డ్రైప్రూట్స్, జీడిపప్పు, సీపుడ్స్ లాంటి వాటిల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పుడ్ తినడం వల్ల మీ శరీరానికి మంచి పోషకాలు అంది మీ జుట్టు రాలిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా మంచి ఒత్తైనా జుట్టు రావడంతోపాటు కుదుళ్లు బలపడతాయి.
ఈ ఆహారం తీసుకుంటూనే వారంలో రెండు సార్లు తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ పాల్ తగ్గుతుంది. ఒక వేళ ఇంకా జుట్టు రాలుతుంటే ధైరాయిడ్ టెస్టు చేయించుకోండి. వైద్యుల సలహాతో మందులు వాడండి. ఎందుకంటే ధైరాక్సిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగానే ఈ సమస్య మెుదలవుతుంది. మీ డైట్ లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకోండి.
Also Read: White Hair Solution: రూ.10 గల ఈ వస్తువులతో తెల్ల జుట్టు 5 రోజుల్లో నల్లగా మారడం ఖాయం!
మీ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మెంతులు కీలకపాత్ర పోషిస్తాయి. మెంతి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించి.. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నిమ్మరసం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల కూడా హెయిర్ పాల్ అవ్వదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook