PAN-Aadhaar Link: ఆధార్ - పాన్ లింక్ చేశారా..? సింపుల్‌గా ఇలా చేసుకోండి!

PAN Link with Aadhaar Online: పాన్-ఆధార్ లింక్ చేయడానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయంలో ఉంది. ఈ నెల 30వ తేదీని డెడ్‌లైన్‌గా ఇప్పటికే ఆదాయపన్ను శాఖ విధించింది. మీరు ఇంకా లింక్ చేయకపోతే జూలై 1వ తేదీ తరువాత పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 28, 2023, 05:52 PM IST
PAN-Aadhaar Link: ఆధార్ - పాన్ లింక్ చేశారా..? సింపుల్‌గా ఇలా చేసుకోండి!

PAN Link with Aadhaar Online: ఆధార్ కార్డుతో పాన్‌ కార్డు లింక్ చేయడం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ తప్పనిసరి చేసింది. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డును చెత్త బుట్టలో పాడేయాల్సిందే. అంతేకాకుండా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నెల 30వ తేదీ వరకు రూ.1000 ఫైన్‌తో ఆధార్‌-పాన్ లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఈలోపు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. అంటే ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకపోతే జూలై 1వ తేదీ నుంచి పాన్ కార్డులు పనిచేయవు.

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ట్యాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను రీఫండ్ నిలిపివేస్తుంది. టీసీఎస్, టీడీఎస్‌కు అధిక ఛార్జీలు వసూలు చేస్తుంది. పాన్ లింక్ చేయనికి కాలానికి నిలిచిపోయిన డబ్బుపై ఎటువంటి వడ్డీ కూడా లభించదు. మార్చి 28వ తేదీ వరకు 51 కోట్లకుపైగా పాన్-ఆధార్‌లు లింక్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఆధార్‌తో పాన్ ఇలా లింక్ చేయండి

==> ఇన్‌కమ్ ట్యాక్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో “లింక్ ఆధార్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> మీ పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
==> "ఈ-పే ట్యాక్స్ ద్వారా పే కంటిన్యూ" ఆప్షన్‌ను ఎంచుకోండి.

Also Read: Odisha Bus Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం

==> పాన్, మొబైల్ నంబరును ఎంటర్ చేసిన తరువాత.. ఓటీపీ వైరిఫై చేయండి.
==> తరువాత ఈ-పే ట్యాక్స్‌ పేజీకి వెళతారు
==> AY 2024-25ని ఎంచుకోవచ్చు. పేమెంట్ మోడ్‌ను “Other Receipts (500)” ఆప్షన్ ఎంచుకుని.. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> అప్లికేబుల్ అమౌంట్ 'Others' సెక్షన్‌ కింద ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. 
==> ఇక్కడ పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఉపయోగించి.. మీ ఆధార్ నంబర్‌ను మీ పాన్‌కి లింక్ చేయడానికి కొనసాగండి.
==> మీరు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించి.. మీ పాన్-ఆధార్ లింకింగ్ స్టాటస్‌ను చెక్ చేయవచ్చు. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 'క్విక్ లింక్స్' క్లిక్ చేసి.. ఆపై 'లింక్ ఆధార్ స్థితి'ని ఎంచుకోండి.
==> మీ పాన్, ఆధార్ నంబర్‌లను నమోదు చేసి.. 'లింక్ ఆధార్ స్టాటస్‌ను వీక్షించండి'పై క్లిక్ చేయండి. మీ ఆధార్ స్టాటస్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
==> ఆధార్-పాన్ లింక్ చేసినట్లు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

వీళ్లు లింక్ చేయాల్సిన అవసరం లేదు

==> అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల నివాసితులు 
==> భారతీయ పౌరులు కానివారు
==> 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఉన్న వారు 

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News