Shani Trayodashi 2023: ప్రతి సంవత్సరం శుక్లపక్షమి త్రయోదశిన రోజున శని త్రయోదశి జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ త్రయోదశి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శని త్రయోదశి రోజున శని దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శని త్రయోదశి రోజున వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి సంవత్సరం శని త్రయోదశి శుక్లపక్షమి త్రయోదశి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం శని త్రయోదశి జులై 1వ తేదీన వస్తోంది. ఈరోజు శని దేవుడి ఆలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వికలాంగులకు నిరుపేదలకు దానధర్మ కార్యక్రమాలు కూడా చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
శని త్రయోదశి రోజున శని దేవుడి చిత్రపటం ముందు రాగి పాత్రను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి నాణేన్ని పెట్టి పూజించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.
శని త్రయోదశి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న శని దేవాలయానికి వెళ్లి శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శని చెడు ప్రభావం తొలగిపోయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు.
ప్రతి శని త్రయోదశి రోజున శని పూజ ముగిసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు ముందు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణాలు చేయడం వల్ల రాహుకేతు చెడు ప్రభావం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి.
శని దేవుడికి ఇష్టమైన వస్తువులను శని త్రయోదశి రోజున నిరుపేదలకు దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శని సాడే సాతి నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు శని దేవుడికి ఇష్టమైన తీపి నైవేద్యాలను పెట్టడం వల్ల శని అనుగ్రహం కూడా లభిస్తుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook