Deputy CM Ajit Pawar Properties: మహారాష్ట్ర రాజకీయాలను సినిమాలను మించి ట్విస్టులతో ఆసక్తిని రేపుతున్నాయి. 2019 ఎన్నికల తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పార్టీలో కీలక నేతలు అనుకున్నవారు రాత్రికి రాత్రే తమ వర్గంతో జంప్ అవుతున్నారు. శివసేనకు ఏక్‌నాథ్ షిండే షాక్ ఇవ్వగా.. తాజాగా ఎన్‌సీపీకి అజిత్ పవర్ ఝలక్ ఇచ్చారు. అప్పుడు ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి దక్కగా.. ఇప్పుడు అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఆయనతోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. అజిత్ పవార్ ఇచ్చిన షాక్ నుంచి ఎన్‌సీపీ తేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
అజిత్ పవార్ ఆస్తుల విలువ ఎంత అని నెట్టింట చర్చ మొదలైంది. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా అజిత్ పవార్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రూ.105 కోట్లుగా ఉంది. నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా అజిత్ పవార్ స్వయంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. 3 కార్లు, 4 ట్రాలీలు, 2 ట్రాక్టర్లు కూడా ఉన్నాయని తెలిపారు. అజిత్ భార్యకు కూడా చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
హోండా అకార్డ్, హోండా సీఆర్‌వీ, ఇన్నోవా క్రిస్టా, ఒక మోటార్ సైకిల్, ఒక ట్రాక్టర్, టయోటా కాంబ్రే అజిత్ పవర్ భార్య వద్ద ఉన్నాయి. అజిత్ వద్ద సుమారు రూ.13 లక్షల 90 వేల విలువైన బంగారు, వెండి నగలు ఉన్నాయి. తన భార్య వద్ద దాదాపు రూ.61 లక్షల 56 వేల విలువైన నగలు ఉన్నాయని వెల్లడించారు. తన వద్ద ఉన్న భూముల విలువ రూ.50 కోట్లుగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్‌సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు తనకు మద్దతు ఇచ్చారని అజిత్ పవార్ గవర్నర్‌కు సమర్పించిన లేఖలో వెల్లడించారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్‌సీపీ పేరు, గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన తెలిపారు. అజిత్ పవార్‌తోపాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, ధర్మారావు ఆత్రమ్, ఆదిత్య తత్కరే, సంజయ్ బాబురావు బన్సోడే, అనిల్ పాటిల్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 5న ఎన్‌సీపీకి చెందిన నాయకులతో అజిత్ పవార్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 42 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. 29 మంది ఎమ్మెల్యేలతో జంప్
Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి