Lahiru Thirimanne Retirement: శ్రీలంక వెటరన్ ప్లేయర్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఈ సీనియర్ ప్లేయర్.. సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. గతేడాది మార్చిలో శ్రీలంక తరుఫున చివరి వన్డే ఆడాను. 12 ఏళ్లపాటు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించిన తిరిమన్నె.. శ్రీలంక క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. తిరిమన్నె తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశాడు.
దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు శ్రీలకం క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు తిరిమన్నె. తన క్రికెట్ కెరీర్‌పై ప్రభావాన్ని చూపిన ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకున్నాడు ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహచరులు, ఫిజియోథెరపిస్ట్‌లు, శిక్షకులు, వ్యాఖ్యతలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అండగా అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.
"ఒక ఆటగాడిగా నేను నా వంతు కృషి చేశా. జట్టును గెలిపించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను. నేను ఆటను గౌరవించాను. నా మాతృభూమికి నిజాయితీగా నా బాధ్యతను నిర్వర్తించాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని నేను ఇక్కడ ప్రస్తావించలేను" అని తిరిమన్నె సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
కెరీర్ మొత్తం 44 టెస్టు మ్యాచ్‌లు ఆడిన తిరిమన్నె.. 26.4 సగటుతో మొత్తం 2088 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో.. భాగస్వామ్యాలు నెలకొల్పడంతో తిరిమన్నె కీలక పాత్ర పోషించాడు. 127 వన్డే మ్యాచ్‌ల్లో 34.7 సగటుతో 3194 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 21 అర్ధశతకాలు బాదాడు. టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు 155 నాటౌట్. వన్డేల్లో అత్యధిక స్కోరు 139 నాటౌట్. 26 టీ20 మ్యాచ్‌ల్లో 291 పరుగులు చేశాడు.
ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనూ తిరుమన్నె రికార్డు అద్భుతంగా ఉంది. 23 సెంచరీలతో 8799 రన్స్ చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 233 మ్యాచ్‌ల్లో 6007 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 7
శతకాలు, 43 అర్ధ సెంచరీలు బాదాడు. తిరిమన్నె రిటైర్మెంట్‌పై మిస్ యూ ఛాంపియన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి