IND A vs PAK A Asia Cup 2023: ఫైనల్లో యువ భారత్ చిత్తు.. ఛాంపియన్‌గా పాకిస్థాన్

India A Vs Pakistan A Final Highlights: ఓటమి లేకుండా ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న యువ భారత్.. చివరి పోరులో దయాది పాక్ చేతిలో చిత్తయింది. అన్ని రంగాల్లో విఫలమైన టీమిండియా ఏ జట్టు 128 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది. 

Written by - Ashok Krindinti | Last Updated : Jul 23, 2023, 10:21 PM IST
IND A vs PAK A Asia Cup 2023: ఫైనల్లో యువ భారత్ చిత్తు.. ఛాంపియన్‌గా పాకిస్థాన్

India A Vs Pakistan A Final Highlights: ఎమర్జింగ్ ఆసియా కప్-2023 విజేతగా పాకిస్థాన్ A జట్టు నిలిచింది. ఫైనల్లో భారత్ A జట్టును 128 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 40 ఓవర్లలో కేవలం 224 రన్స్‌కే కుప్పకూలింది. భారీ లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు చేతులెత్తేశారు.  అభిషేక్ శర్మ అత్యధికంగా 61 పరుగులు చేయగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ టైబ్ తాహిర్ (108) సెంచరీతో కదం తొక్కాడు. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది.
 
పాకిస్థాన్ విధించిన భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 29 పరుగులు చేసి సుదర్శన్ ఔట్ కావడంతో వికెట్ల పతనం ఆరంభమైంది. అభిషేక్ (51 బంతుల్లో 61, 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకోగా.. నికిన్ జోస్ (11) విఫలమయ్యాడు. కెప్టెన్ యశ్ ధుల్ 39 పరుగులతో పర్వాలేదనిపించినా.. కీలక సమయంలో ఔట్ అయ్యాడు. 

9 పరుగులకే నిశాంత్ సింధు, రియాన్ పరాగ్ 14 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవడం భారత్ ఓటమి ఖరారు అయింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్లను పాక్ బౌలర్లు చకచక ఔట్ చేయడంతో 224 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముకిమ్ 3 వికెట్లు తీయగా.. అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం జూనియర్ తలో రెండేసి వికెట్లు తీశారు. ముబాసిర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టుకు ఓపెనర్లు సామ్ అయూబ్ (59), సాహిబ్జాదా ఫర్హాన్ (65) గట్టి పునాది వేశారు. తొలి వికెట్‌కు 17.2 ఓవర్లలో 121 జోడించారు. అనంతరం తయ్యబ్ తాహిర్ 71 బంతుల్లో 108 (12 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో చెలరేగి ఆడాడు. దీంతో పాక్ జట్టు భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, రియాన్ పరాగ్ చెరో రెండు వికెట్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ పడగొట్టారు.  ఫైనల్ వరకు ఓటమి లేకుండా దూసుకువచ్చిన యువ భారత్.. తుది పోరులో పాక్ చేతిలో ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: PM Kisan Latest Updates: అన్నదాతలకు ముఖ్య గమనిక.. ఆ రోజే అకౌంట్‌లోకి డబ్బులు జమ  

Also Read: Rapido Driver: ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. యువతి బైక్ ఎక్కగానే డ్రైవింగ్ చేస్తూ హస్తప్రయోగం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x