HBD Dhanush: ' కెప్టెన్ మిల్లర్'గా ధనుష్.. టీజర్ అదుర్స్..

Captain Miller:  తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. 1930ల నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ సినిమా టీజర్.. ధనుష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 11:16 AM IST
HBD Dhanush: ' కెప్టెన్ మిల్లర్'గా ధనుష్.. టీజర్ అదుర్స్..

Captain Miller teaser out: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) లేటెస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’(Captain Miller). ఈ పీరియాడికల్ ఫిల్మ్‌కి 'రాకీ అండ్ సాని కాయిదం' ఫేమ్  అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలకపాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. బ్రిటిష్ కాలం నాటి యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్‌కి అన్నయ్యగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మార్క్ బెన్నింగ్టన్, నాజర్, ప్రియాంక అరుల్మోహన్, నివేదిత సతీష్, జాన్ కొక్కెన్ మరియు మూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ధనుష్ మూడు గెటప్ ల్లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 

నేడు ధనుష్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ మిల్లర్ టీజర్ (Captain Miller teaser ) రిలీజ్ చేశారు. ప్రచార చిత్రం మెుత్తం పోరాట ఘట్టాలు.. యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు. బ్రిటిషుర్స్ కు, కెప్టెన్ మిల్లర్ కు జరిగే పోరుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 100 సెకన్స్ నిడివి ఉన్న టీజర్.. సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 85 శాతం పూర్తయింది. ఈ చిత్రం ధనుష్ కెరీర్‏లోనే అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతుంది. ఈసినిమాను డిసెంబరు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీని సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News