How To Get Credit Cards: ఎక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఈజీగా అప్రూవ్ కావాలంటే..

How To Get Credit Cards: చాలామంది చాలా రకాల లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు విరివిగా ఉపయోగిస్తున్న కాలం ఇది. ఈరోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం కూడా సులభమే. మీ శాలరీ పే స్లిప్స్ ఆధారంగా కానీ లేదా మీ ఇతర ఆదాయ వనరులను చూసి మీ క్రెడిట్ లిమిట్ అప్రూవ్ చేస్తారు. అత్యవసరంలో డబ్బులు లేకున్నా మీ పని అయ్యేందుకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.

Written by - Pavan | Last Updated : Aug 2, 2023, 10:35 PM IST
How To Get Credit Cards: ఎక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఈజీగా అప్రూవ్ కావాలంటే..

How To Get Credit Cards: క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారా ? క్రెడిట్ కార్డు వస్తుందో రాదోనని టెన్షన్ పడుతున్నారా ? ఒకవేళ క్రెడిట్ కార్డు అప్రూవ్ అయినప్పటికీ.. క్రెడిట్ లిమిట్ ఎంత వస్తుందో అని సస్పెన్స్ లో ఉన్నారా ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలిస్తే.. మీరు నిశ్చింతగా ఉండటం మాత్రమే కాదు.. మీకు నచ్చిన బ్యాంక్ నుండి ఎక్కువ క్రెడిట్ లిమిట్ తో ఈజీగా క్రెడిట్ కార్డు కూడా సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. 

క్రెడిట్ కార్డు అనేది మీ ఆర్థిక స్తోమత తెలిపే డాక్యుమెంట్స్, అర్హతలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుంది. అందుకే మీరు క్రెడిట్ కార్డ్ కోసం అప్లై  చేసుకునే ముందు మీకున్న అర్హతలు, క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ వంటి వివరాలు చెక్ చేసుకోవడం ఉత్తమం. మెరుగైన క్రెడిట్ స్కోర్, గతంలో తీసుకున్న రుణాలపై సకాలంలో బిల్లు చెల్లింపులు, చెక్ బౌన్స్ లేకుండా ఉంటే అవి మీ అర్హతలను పెరిగేలా చేస్తుంది. అలా కాకుండా లేట్ పేమెంట్స్, గతంలో తీసుకున్న రుణాలు ఏమైనా ఎగ్గొట్టి ఉంటే... అవి మీ క్రెడిట్ స్కోర్ పై దుష్ప్రభావం చూపిస్తాయి.   

చాలామంది చాలా రకాల లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు విరివిగా ఉపయోగిస్తున్న కాలం ఇది. ఈరోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం కూడా సులభమే. మీ శాలరీ పే స్లిప్స్ ఆధారంగా కానీ లేదా మీ ఇతర ఆదాయ వనరులను చూసి మీ క్రెడిట్ లిమిట్ అప్రూవ్ చేస్తారు. అత్యవసరంలో డబ్బులు లేకున్నా మీ పని అయ్యేందుకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. పైగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరుస్తాయి. 

క్రెడిట్ కార్డ్‌ కానీ లేదా లోన్స్ కోసం దరఖాస్తు చేస్తే 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ అవసరం అవుతుంది. క్రెడిట్ కార్డులు రావడం ఈజీనే కానీ మీ అవసరాలకు అనుగుణంగా ఉండే క్రెడిట్ కార్డుని ఎంచుకుంటే అది మీకు కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడమే కాకుండా రివార్డ్స్ పాయింట్స్, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇలా రకరకాలుగా మీకు ఉపయోగపడుతుంది. అందుకే ఏ బ్యాంక్ ఎలాంటి క్రెడిట్ కార్డులు ఇస్తోంది అనేది చెక్ చేసి ఒకదానితో మరొకటి సరిపోల్చి చూడండి.

Trending News