Pawan Kalyan: రాజకీయాలకు బ్రేక్, మళ్లీ షూటింగు బాటపట్టనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ద రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ షూటింగులకు సిద్ధమౌతున్నారు. రాజకీయాలకు మరో బ్రేక్ ఇచ్చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2023, 07:02 AM IST
Pawan Kalyan: రాజకీయాలకు బ్రేక్, మళ్లీ షూటింగు బాటపట్టనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. చంద్రబాబు పర్యటన, లోకేష్ పాదయాత్రతో పాటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ముందస్తు ఊహాగానాలు విన్పిస్తూనే ఉన్నాయి. అయినా జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ షూటింగుల బాటపట్టారు. 

జనసేనాని పవన్ కళ్యాణ్‌పై అధికార వైసీపీ విమర్శలకు తగ్గట్టుగానే ఆయన వ్యవహారం సాగుతోంది. వెఎస్సార్ కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్‌ను తరచూ పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శిస్తుంటారు. నచ్చినప్పుడు సినిమాలు లేదా రాజకీయాలు చేస్తుంటారని ట్రోలింగ్ చేస్తుంటారు. వైసీపీ నేతల విమర్శల సంగతేమో గానీ పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, వ్యవహారం కూడా అలానే ఉంటోంది. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ జనసేనాని మళ్లీ షూటింగ్ బాటపడుతున్నారు. కొద్దిరోజుల పాటు రాజకీయా పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. 

రన్ రాజా రన్, సాహో చిత్రాల్ని తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇదొక భారీ బడ్జెట్ సినిమా. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి కూడా కన్పించనున్నాడు. ఇంకా ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ ఇతర నటులు కూడా ఉన్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందింస్తుండగా డిసెంబర్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

కొద్దిరోజుల క్రితం ముంబైలో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి అప్పుడే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సినిమాతో పాటు చేతిలో ఉన్న ఇతర సినిమాలను పూర్తి చేసే ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొద్దిగా బ్రేక్ ఇస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం అక్టోబర్ నెలలో 20 రోజులు, నవంబర్ నెలలో 8 రోజులు సినిమా పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. షూటింగ్ మొత్తం బ్యాంకాక్‌లో ఉండనుంది. అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో రాజకీయాలు వేడి వేడిగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నాటికి మరింత వేడెక్కవచ్చు అలాంటి సమయంలో సినిమాలేంటనే విమర్శలు కూడా వస్తున్నాయి.

Also read: Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర.. జగన్ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News