World Cup 2023: వరల్డ్ కప్ షెడ్యూల్‌లో నో ఛేంజ్‌.. హెచ్‌సీఏకి బీసీసీఐ క్లారిటీ

Hyderabad Cricket Association: వరల్డ్ కప్‌ షెడ్యూల్‌పై హెచ్‌సీఏ చేసిన రిక్వెస్ట్‌ను బీసీసీఐ తిరస్కరించింది. ఇప్పటికే ఒకసారి మార్చడంతో.. మరోసారి ఛేంజ్ చేయడం కష్టమవుతుందని తెలిపింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరగనున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 22, 2023, 11:36 AM IST
World Cup 2023: వరల్డ్ కప్ షెడ్యూల్‌లో నో ఛేంజ్‌.. హెచ్‌సీఏకి బీసీసీఐ క్లారిటీ

Hyderabad Cricket Association: ప్రపంచకప్ షెడ్యూల్ మరోసారి మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఒకసారి మార్చామని.. మరోసారి షెడ్యూల్‌ను మార్చడం కుదరదని తెలిపింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వరుస రెండు రోజుల్లో రెండు మ్యాచులకు భద్రత కల్పించేందుకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్‌సీఏ దృష్టికి హైదరాబాద్ పోలీసులు తీసుకువెళ్లారు. ఈ విషయంపై బీసీసీఐ హెచ్‌సీఏ లేఖ రాసి.. షెడ్యూల్‌పై పునరాలోచించాలని కోరింది. ఈ మేరకు బీసీసీఐ స్పందిస్తూ.. ప్రస్తుతానికి షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదని తెలిపింది.

"మేము బీసీసీఐతో చర్చలు జరిపాము. ప్రస్తుతానికి షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదని వారు చెప్పారు. మేము బీసీసీఐకి సహకరించడానికి అంగీకరించాం" అని సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటర్ ఎల్‌.నాగేశ్వరరావు  నియమించిన సభ్యుడు దుర్గా ప్రసాద్ తెలిపారు. మ్యాచ్‌లకు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్‌సీఎ అధికారులు బీసీసీఐ తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమిన్‌తో సోమవారం విస్తృతంగా చర్చలు జరిపారు.

“బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి నిమిషంలో మార్పు చేయడం సవాలుతో కూడుకున్నదని మాకు చెప్పారు. మ్యాచ్‌లను సక్రమంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నగర పోలీసు కమిషనర్‌తో చర్చించాం.  మ్యాచ్‌ల నిర్వహణకు పూర్తిగా సహరిస్తామని హామీ ఇచ్చారు.

అక్టోబర్ 9న హైదరాబాద్‌లో న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మరుసటి రోజు పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు డే/నైట్ మ్యాచ్‌లు. శ్రీలంక, పాకిస్థాన్ ఉప్పల్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాయి. కానీ షెడ్యూల్ కారణంగా ఇది సాధ్యపడదు. అయితే ప్రత్యామ్నాయ వేదిక వద్ద ప్రాక్టీస్ సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చని మాకు బీసీసీఐ తెలిపింది. జింఖానా గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌కు ఏర్పాట్లు చేస్తాం..’’ అని హెచ్‌సీఏ అధికారి తెలిపారు. ఒకే వేదిక ప్రపంచ కప్‌లో బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం సాధారణం విషయం కాదన్నారు. ఈ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తుందని చెప్పారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.

Also Read: Kothagudem BRS MLA Ticket: కొత్తగూడెంలో సీన్ చేయొద్దని మంత్రి హరీశ్ రావు క్లాస్ ?

Also Read: Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన కొత్త మార్పులు ఇవే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News