Kia Ray Ev Price: త్వరలోనే తక్కువ ధరతో Kia నుంచి మినీ EV..ఫీచర్స్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Kia Ray Ev Price In India: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ కియా త్వరలోనే మరో ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయబోతోంది. అయితే ఈ కారు Ray EV అనే నామకరణంతో విడుదల అవ్వబోతోందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2023, 05:20 PM IST
Kia Ray Ev Price: త్వరలోనే తక్కువ ధరతో Kia నుంచి మినీ EV..ఫీచర్స్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 

Kia Ray Ev Price In India: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. పెరుగుతున్న ప్రెట్రోల్‌ రేట్లను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు EV వాహనాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఆటో కంపెనీలు కూడా వీటి తయారీలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. మార్కెట్‌లో చాలా కార్ల కంపెనీ EV కార్లను విడుదల చేశాయి. కానీ ఇందులో సక్సెస్‌ అయిన కార్ల కంపెనీల్లో కియా ఒకటి. కియా తన కార్లకు ఉన్న క్రేజ్‌ను నిలుపుకోవడానికి అతి త్వరలోనే మార్కెట్‌లోకి నానో ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయబోతోంది. కియా ఈ స్మార్ట్‌ కారును Ray EV అనే నామకరణంతో విడుదల చేయబోతోందని సమాచారం. అయితే ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కియా ఇంతక ముందే ఈ నానో ఎలక్ట్రిక్‌ కారును దక్షిణ కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే అక్కడ మంచి స్పందన రావడంతో త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. కంపెనీ ఈ కారును అక్కడ ధర 27.35 మిలియన్ వాన్ ($20,500/ ₹17 లక్షలు)కు లాంచ్‌ చేసిందని సమాచారం. ఈ కారు డిజైన్‌ పరంగా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన MG కామెట్ లాగా ఉండబోతోంది. అయితే ఫీచర్ల పరంగా దాని కంటే కొంత భిన్నంగా ఉంటుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. హెడ్‌లైట్ డిజైన్ విషయానికొస్తే..ఈ కారులో హెడ్‌లైట్ అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటుందని సమాచారం. ఈ కారు భారత మార్కెట్‌లోకి విడుదలైతే మొత్తం 6 కలర్స్‌లో లభించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

కియా Ray EV 10.25 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు సెంట్రల్ క్లస్టర్‌పై AC డిస్‌ప్లే, అదనపు స్టోరేజ్ స్పేస్‌తో వస్తోంది. అంతేకాకుండా ఈ కారులో ఉండే నాలుగు సీట్లు మడుకునే విధంగా కొత్త ఫీచర్స్‌తో కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ ఈ కార్లలో కార్గో వేరియంట్ సింగిల్ సీట్ సెటప్‌ను కలిగి ఉంటుందని కియా వెల్లడించింది. 

కొత్త కియా రే EV అతి పెద్ద బ్యాటరీ ప్యాకప్‌తో రాబోతోంది. ఇందులో 35.2 kWh బ్యాటరీ ప్యాక్‌ కలిగిన బ్యాటరీని అందుబాటులో ఉంచబోతున్నట్లు కియా పేర్కొంది. అయితే మార్కెట్‌లో ఇంతకముందు విడుదలైన చాలా ఎలక్ట్రిక్‌ కార్లు 138 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ కియా Ray EV మాత్రం సుమారుగా 205 కిలోమీటర్లు వరకు నాన్‌స్టాప్‌గా వెళ్తుందని కియా వెల్లడించింది. అంతేకాకుండా ఈ బ్యాటరీ దాదాపు 7 KWల ఛార్జర్‌ సపోర్ట్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారుకు  6 గంటల పాటు ఛార్జ్‌ చేస్తే దాదాపు 205 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News