Jammu Kashmir & Haryana Assembly Election Result 2024: జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యలో లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత డీ లిమిటేషన్ తర్వాత మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. గతంలో కంటే ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. ప్రజలందరు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ తో పాటు హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ లో మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. హర్యానాలో ఒకే విడతలో ఈ నెల 5న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమిలు తమ అస్త్ర శస్త్రాలతో బరిలో దిగాయి.
హర్యానా..
హర్యానాలో మొత్తంగా 90 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒకే దశలో ఇక్కడ పోలీంగ్ జరిగింది. గత రెండు పర్యాయాలు ఇక్కడ అధికారం అనుభవించిన బీజేపీకి ఇక్కడ భారీ ఎదురు దెబ్బ తగలనున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. వారి అంచనాలు నిజమయ్యి.. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందా అనేది చూడాలి.రీసెంట్ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ సగానికి సగం కోల్పోయింది. ముఖ్యంగా రైతుల పేరిట జరిగిన కొన్ని ఉద్యమాలు.. రెజ్లర్ ఉద్యమాలు బీజేపీకి ఇక్కడ కోలుకోలేని దెబ్బ తీసినట్టు చెబుతున్నారు. మరి ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మరి కాసేపట్లో తెలియనుంది.
జమ్ము కశ్మీర్..
జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగుతున్నాయి. దాదాు దశాబ్ద కాలం తర్వాత జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఎలక్షన్స్ జరిగాయి. అంతేకాకుండా మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మోదీ సర్కారు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ ఎన్నికలు జారుగుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ రీజియన్ లో బీజేపీ పర్ఫామెన్స్ బాగున్నట్టు పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కశ్మీర్ లోయలో పీడీపీ, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్టు గెలిచే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం 46. మరోవైపు 2014 లో అక్కడ ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీ,పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసాయి. తాజాగా ఎన్నికల్లో ఉప్పు, నిప్పుగా తలబడ్డాయి. మాత్రం రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల బరిలోకి దిగాయి. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీ పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగాయి. మరి ఇంజినీర్ రషీద్ సహా పలు చిన్నా చితక పార్టీలు స్వతంత్రులుగా బరిలో దిగారు. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter