Tecno Pova 5 Pro: అమెజాన్‌లో Tecno Pova 5 Pro 5Gపై ప్రత్యేక ఆఫర్..రూ.900 కంటే తక్కువ ధరకే మొబైల్, ఎగబడి కొంటున్న జనాలు!

Tecno Pova 5 Pro 5G Price: మార్కెట్లోకి ఇటీవల విడుదలైన Tecno Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ లో ప్రత్యేక ఆఫర్ నడుస్తోంది. ఈ మొబైల్ ఫోను ఇప్పుడే కొనుగోలు చేస్తే కేవలం రూ.900 కంటే తక్కువ ధరలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2023, 08:46 PM IST
Tecno Pova 5 Pro: అమెజాన్‌లో Tecno Pova 5 Pro 5Gపై ప్రత్యేక ఆఫర్..రూ.900 కంటే తక్కువ ధరకే మొబైల్, ఎగబడి కొంటున్న జనాలు!

Tecno Pova 5 Pro 5G Price: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన 5G స్మార్ట్ ఫోన్ లకి మంచి డిమాండ్ ఉంది తక్కువ బడ్జెట్ లో లభించే ఎక్కువ ఫీచర్లు కలిగిన 5G స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ కామర్స్ కంపెనీలు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు.. ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో Tecno Pova 5 Pro 5G మొబైల్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

టెక్నో కంపెనీ మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో రూ. 15,999 విక్రయించింది. అయితే ఆమెజాన్ సాధారణ కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ పై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,999లకు లభిస్తోంది. Tecno Pova 5 Pro 5G మరింత తగ్గింపు ధరతో కొనుగోలు చేయాలనుకుంటే.. అమెజాన్ అనుసంధాన బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్లు చెల్లిస్తే.. రూ. 1,250 వరకు అదనంగా తగ్గింపు పొందవచ్చు. ఈ బ్యాంకు ఏ కాకుండా ఇతర బ్యాంకులపై కూడా తగ్గింపు లభిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు ఆమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

ఎక్స్చేంజ్ ఆఫర్:
Tecno Pova 5 Pro 5G మొబైల్ ఫోన్ పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసి ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు. ఈ బోనస్ కారణంగా ఈ స్మార్ట్ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బోనస్ మీ పాత ఫోన్ యొక్క కండిషన్, మోడల్ను బట్టి అప్లికేబుల్ అవుతుంది. మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే.. రూ. 14,249 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ కేవలం రూ.900 కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు.

Tecno Pova 5 Pro 5G ఫీచర్స్‌:
6.78 అంగుళాల డిస్‌ప్లే
HD ప్లస్ డాట్-ఇన్ డిస్‌ప్లే సపోర్ట్‌
68W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీని ప్యాక్
240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
మల్టీ-కలర్ బ్యాంక్‌లిట్ ఆర్క్ ఇంటర్‌ఫేస్ 
 50 మెగాపిక్సెల్ HD డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News