New TTD Board Members: టిటిడి చైర్మన్ గా ఇటీవలె భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడి బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిపై ఏపీ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యేల కోటాలో సామినేని ఉదయభాను (జగయ్యపేట ఎమ్మెల్యే), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం ఎమ్మెల్యే), తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే) లకి అవకాశం లభించింది.
ఆ తరువాత టీటీడీ పాలకవర్గం సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు (ఉంగుటూరు), నాగ సత్యం యాదవ్ (ఏలూరు), శిద్ధా సుధీర్ ( ప్రకాశం జిల్లా నుండి శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప జిల్లా నుంచి యానాదయ్య, మాసీమ బాబు, మంత్రాలయం నుండి వై. సీతారామిరెడ్డి, అనంతపురం నుంచి అశ్వద్థనాయక్‌లకు చోటు లభించింది. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్‌పాండే, తెలంగాణ నుంచి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి, మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ సర్వకర్‌లకు టీటీడీ నూతన పాలకవర్గంలో చోటు కల్పించారు.
ఇది కూడా చదవండి : Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం, ఏపీ- తెలంగాణల్లో భారీ వర్షాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసు విచారణ ఎదుర్కొంటూ కొంతకాలం పాటు విచారణ ఖైదీగా ఉండి, అప్రూవర్‌గా బెయిల్‌పై విడుదలైన పెనాక శరత్‌చంద్రా రెడ్డికి ఏపీ సర్కారు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించింది. అలాగే 2001లో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణల్లో ఆ పదవిని కోల్పోయిన యూరాలజిస్ట్ డా.కేతన్ దేశాయ్ కి ఈ జాబితాలో చోటు దక్కింది. డా కేతన్ దేశాయ్ స్వస్థలం గుజరాత్. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చోటు కల్పించడం ఏంటంటూ కొంతమంది ప్రశ్నిస్తుండగా.. తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలోనూ చర్చనియాంశమైంది.
ఇది కూడా చదవండి : TVS Showroom Fire Accident: భారీ అగ్నిప్రమాదం..300 వాహనాలు బుగ్గిపాలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి