Flavonoids: శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమైనట్టే ఫ్లెవనాయిడ్స్ కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. వాస్తవానికి ఇవి మొక్కల్లో అత్యధికం. పండ్లు, కూరగాయలు, పువ్వుల రంగుల్ని నిర్ణయించేది, నిర్ధారించేది ఫ్లెవనాయిడ్స్ మాత్రమే. అందుకే వీటికి అంతటి ప్రాధాన్యత. వీటితో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శరీరానికి కావల్సిన ఫ్లెవనాయిడ్స్ కోసం ఏయే పదార్దాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
హెస్పెరిడిన్ పండ్లు అంటే సీతాఫలం చాలా మంచిది. సీతాఫలం తొక్కలో ఉండే హెస్పెరిడిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాంతోపాటు స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తుంది. ఐసోఫ్లెవవోన్స్గా చెప్పుకునే సోయా ఉత్పత్తులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్ హార్మోనల్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
ఇక ఫ్లెవోన్స్గా పిల్చుకునే వాము నీళ్లలో ఫ్లెవోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. క్వెర్ సెటీన్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు, ఆపిల్, బెర్రీ, టీ తీసుకోవడం చాలా మంచిది. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు చాలా ఎక్కువగా లభిస్తాయి. దాంతోపాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం.
గ్రీన్ టీ, చాకోలేట్, పండ్లలో కెటేచిన్ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేన్సర్‌కు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పోరాడుతాయి. రూటిన్ అనేది నిమ్మ, బుక్వీట్, శెతావర్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్త నాళాల్ని ఆరోగ్యకరంగా మారుస్తాయి. ఇక వాము, పచ్చిమిర్చి, క్యారెట్, చమోమైల్ టీలో ల్యూటిన్ ఎక్కువగా ఉంటుంది. స్వెల్లింగ్ తగ్గిస్తుంది. కేన్సర్ ముప్పును తగ్గించగలదు. ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఇక టీ, చాకోలేట్‌తో పాటు కొన్ని పండ్లలో ఎపికెటేచిన్ ఎక్కువగా ఉంటాయి. కెటేకిన్స్ లానే ఇవి కూడా చాలా పోషకాలు కలిగి ఉంటాయి. ఇక కేంఫెరోల్ కోసం అరటి, బ్రోకోలి, టీ, బెర్రీలు తినాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను కల్గిస్తాయి. కేన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ఇక చిట్ట చివరిగా ఏంథోథయాసిన్స్ కోసం ఎరుపు, నీలం, వంకాయ రంగులు ప్రభావితం చేస్తాయి. చాలా రకాల పండ్లు, కూరగాయలు ముఖ్యంగా బెర్రీలు, ద్రాక్ష, ఎర్ర కాలిఫ్లవర్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
Also read: Blackberry Fruits: ఈ ఒక్క పండు తింటే చాలు కేన్సర్, గుండెపోటు దరిచేరవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook