AP Capital: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం త్వరలో పరిపాలన ప్రారంభించనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ప్రభుత్వం వివిధ దశల్లో తీసుకుంటున్న చర్యలు బలం చేకూరుస్తున్నాయి. దసరా నాటికి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ప్రారంభం కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి త్వరలో పరిపాలన చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి మాత్రం దసరా నుంచి తప్పకుండా విశాఖకు మకాం మార్చనున్నారని తెలుస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తరువాత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రుషికొండలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం శరవేగంగా తయారవుతోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి లేదా అక్టోబర్ 24 విజయ దశమి సందర్భంగా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో విశాఖపట్నం ప్రాతిపదికగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్ హోదా పెంచడం వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది. పోలీస్ కమీషనరేట్ పరిధిని ప్రభుత్వం అడిషనల్ డీజీ ర్యాంక్‌కు పెంచి..కొత్త కమీషనర్‌గా 1994 బ్యాచ్ రవిశంకర్ అయ్యన్నార్ను నియమించింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ పనిచేసిన త్రివిక్రమ్ వర్మను బదిలీ చేసింది.
విశాఖ పోలీస్ వ్యవస్థ పరిణితి ఇలా
1861లో విశాఖ జిల్లా పోలీస్ వ్యవస్థ ప్రారంభమైంది. అప్పట్లో ఎస్పీ స్థాయి అధికారి ఉండేవారు. 1948లో విశాఖపట్నంను ఉత్తరం, దక్షిణ భాగాలుగా విభజించారు 1983లో పోలీస్ కమీషనరేట్ ఏర్పడింది. అర్బన్ పరిధి పెరిగింది. జిల్లాల పునర్విభజన తురవాత విశాఖపట్నం జిల్లా ఒక్కటే పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉండేది. 20 లక్షల జనాభా కలిగిన విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్ పరిధిని ఇప్పుడు అడిషనల్ డీజీ స్థాయికి హోదా పెంచారు.
పరిపాలనా వికేంద్రీకరణణలో భాగంగా త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తానని, విశాఖకు మకాం మారుస్తానని ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సులో జగన్ స్పష్టం టచేశారు. ఆ తరువాత చకచకా అందుకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. రుషికొండ సీఎం కార్యాలయం పనులు ఇంకా జరుగుుతున్నందున విశాఖపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్‌ను సిద్దం చేశారు. ః
Also read: AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో ఆలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook