RBI Assistant Notification 2023: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)లో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పుడు నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. భర్తీ చేయాల్సిన ఖాళీలతో పాటు అర్హత, దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ వంటి పూర్తి వివరాలు ఆ నోటిఫిషన్ లో విడుదల చేయనున్నారు. పూర్తి నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ rbi.org.in లోని రిక్రూట్మెంట్ విభాగంలో తనిఖీ చేయాలి. దరఖాస్తు వచ్చిన తర్వాత RBI అసిస్టెంట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RBI అసిస్టెంట్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ..
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) త్వరలోనే విడుదల చేయబోయే నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో దరఖాస్తు ప్రారంభ తేదీతో పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. RBI రిక్రూట్మెంట్ పోర్టల్ లోని యాక్టివ్ లింక్ లో అప్లికేషన్ పేజీ chances.rbi.org.in లోకి లాగిన్ అయ్యి.. ఆపై అభ్యర్ధులు వారి వివరాలను నమోదు చేయోచ్చు. వివరాలు నమోదు చేసిన తర్వాత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ఎవరు అర్హులు..?
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) లో అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీల నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసున్న అభ్యర్ధులు అర్హులు. అలాంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook