Lokesh Delhi Tour: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ పరిణామాల్ని ఢిల్లీ సాక్షిగా ఎండగట్టేందుకు తెలుగుదేశం సంకల్పించింది. హుటాహుటిన నారా లోకేశ్, నారా భువనేశ్వరిలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో రెండ్రోజుల్నించి చంద్రబాబు కుటుంబీకులు రాజమండ్రిలోనే బస చేశారు. ఇవాళ కాస్సేపటి క్రితం నారా లోకేశ్, అతని తల్లి నారా భువనేశ్వరిలు హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇలా ఉన్నట్టుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని కొందరు, ఢిల్లీ నేతల్ని కలిసేందుకని మరి కొందరు ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం కచ్చితమని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా జరిగిందనే అంశాన్ని జాతీయ మీడియా ముందు ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా జాతీయ స్థాయిలో చర్చకు తెరతీయాలనేది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ , ఇతర పరిణామాలు, ఏపీలో పరిస్థితుల్ని నేషనల్ మీడియా ముందు నారా లోకేశ్ వివరించనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తల్లితో కలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఏపీలో దాడులు చేసినవారిని వదిలేసి బాధితులపైనే ఎక్కువగా కేసులు పెడుతున్నారని టీడీపీ నేతల ఆరోపణ. నాలుగేళ్లలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశంలో మరెక్కడా జరగలేదని జాతీయ మీడియాకు లోకేశ్ వివరించనున్నారు. అంతేకాకుండా అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై దాడులు చేసి..తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని నేషనల్ మీడియా ముందు లోకేశ్ ప్రశ్నిస్తారంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనేది టీడీపీ ప్రదాన ఆరోపణ. ఈ అంశాన్ని హైలైట్ చేయడమే టీడీపీ లక్ష్యంగా ఉంది.
రాష్ట్రంలోని మార్గదర్శి, అమరరాజా వంటి సంస్థలపై ప్రభుత్వం ఎలా దాడులు చేస్తుందో మీడియా ముందు వివరించాలని తెలుగుదేశం నిర్ణయించిందని తెలుస్తోంది. 73 ఏళ్ల వయస్సులో , 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్టు చేసిన తీరుని నారా లోకేశ్ నేషనల్ మీడియా ముందు ప్రస్తావించనున్నారు.
Also read: Chandrababu Bail: ఎట్టకేలకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు, విచారణ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook