Pm Modi Zodiac Sign: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎన్నో సేవలందించారు. అంతేకాకుండా సమయం చాలా శక్తివంతమైనదని చాటరు. ఈ రోజుకి ఆయనకు 73 ఏళ్ల నిండాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ 17 సెప్టెంబర్ 1950లో జన్మించాడు. ఆయనకు చిన్న తనం నుంచి ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మోదీ రాజకీయ జీవితంలో మొత్తం విజయాలే..ఆయన ఎప్పుడు రాజకీయ, సామాజికంగా ఎలాంటి వెనకడుగు వేయలేదు. అయితే ఇలాంటి మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతాగానో ఉంది. కాబట్టి ఆయనకు సంబంధించిన జన్మ పట్టికను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్ర మోదీ జాతక వివరాలు?
1. ప్రధానిగా నరేంద్ర మోదీ జన్మరాశి వృశ్చిక రాశి
2. జాతకానికి అధిపతి కుజుడు
1. ప్రస్తుతం ప్రధానిగా నరేంద్ర మోదీ జాతకంలో పంచ మహాపురుష యోగం ఏర్పడిన లగ్నంలో కుజుడు, చంద్రుడు ఉన్నారు. అంతేకాకుండా చంద్రుడితో ఓ ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది.
2. జాతకం ప్రకారం..కుజుడు ఆరవ, మొదటి స్థానికి అధిపతి వ్యవహరిస్తూ లగ్నంలో స్థిరంగా ఉన్నాడు. దీని కారణంగా శత్రువులు అతనిని ఎన్నటికీ గెలవలేరని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
3. సప్తమేషుడు జాతకంలో పదవ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. దీంతో పాటు గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే శని గ్రహం కూడా 10వ స్థానంలో ఉంది. దీని కారణంగా ప్రధాని ఎప్పుడూ న్యాయం, ధర్మం కోసమే పని చేస్తారు.
4. బృహస్పతి, శుక్రుడు ఒకదానికొకటి ఎదురు, ఎదురు స్థానాల్లో స్థిరంగా ఉన్నాయి. దీంతో ప్రధానిగా నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ పనులు చేస్తారు.
5. పదకొండవ స్థానంలో సూర్యుడు, బుధుడు ఉండడం వల్ల బుధుడు ఆదిత్య యోగా ప్రభావం పడింది. దీని కారణంగా ఆయన ఎల్లప్పుడూ రాజులానే జీవితాన్ని కొనసాగిస్తూ..దేశాన్ని గౌరవప్రదమైన స్థానానంలో నడిపిస్తారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
అంగారక గ్రహంలో బృహస్పతి అంతర్దశ మే 2023 నుంచి వచ్చే ఏప్రిల్ 21 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంగారకుడి మహాదశ 29 నవంబర్ 2021 నుంచి 29 నవంబర్ 2028 వరకు స్థిరంగా ఉంటుంది. దీని కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మున్ముందు అనే రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత గౌరవాన్ని రెపరెపలాడిస్తాడు. అంతేకాకుండా ఎంతో ప్రభావితమైన పంచ మహాపురుష యోగం కూడా ఆయన జాతకంలో ఉంది. దీంతో ఆయన ప్రతిష్ఠ మరింత రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. బృహస్పతి అంతర్దశ కారణంగా ఆయన అన్ని దేశాలకు నాయకుడి నిలుస్తాడు. అంతేకాకుండా అన్ని దేశాల ప్రధానులు సోదరాభావంతో ఉంటారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook