Fixed Deposit Interest Rate: పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ఆదా చేసుకునేందుకు వివిధ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే కొన్నింటిలో పెట్టుబడి పెడితే రిస్క్ అనే భయం కూడా ఉంటుంది. పన్ను ఆదా చేసుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీ నుంచి మంచి వడ్డీ అందితే.. ఎక్కువ ఆదాయం వస్తుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లాక్ ఇన్ పిరియడ్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని బ్యాంకులు ఒకే వడ్డీ రేటును అందించడం లేదు. ఏ బ్యాంక్‌లో ఎఫ్‌డీ వేయాలి..? ఎక్కడ ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది..? వివరాలు ఇలా..
8 బ్యాంకులు సాధారణ వినియోగదారులు, సీనియర్ సిటిజన్‌లకు ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్స్‌పై ఎస్‌బీఐ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్స్ చేసే ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అందజేస్తోంది. ఇతర బ్యాంకులు ఎంత వడ్డీ రేటు వస్తుందంటే..?
==> IndusInd బ్యాంక్ టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై సాధారణ వినియోగదారులకు 7.25 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
==> ఆర్‌బీఎల్ సాధారణ కస్టమర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తోంది.
==> హెచ్‌డీఎఫ్‌సీ సాధారణ వినియోగదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.
==> కెనరా బ్యాంక్ సాధారణ పౌరులకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
==> ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై యాక్సిస్ సాధారణ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.
==> ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఇది సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.
==> యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ వినియోగదారులకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీని అందిస్తోంది.
==> ఐసీఐసీఐ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ సీనియర్ సిటీజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తుండగా.. సాధారణ వినియోగదారులకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
==> పీఎన్‌బీ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీని అందిస్తోంది.
==> బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ వినియోగదారులకు 6.50 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీని అందిస్తోంది.
==> ఐడీబీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
Also Read: Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook