Ketu Gochar 2023: కేతు గ్రహం సంచారంతో ఈ రాశులవారు విపరీతమైన సంపదను పొందబోతున్నారు!

Ketu Gochar 2023: కేతు గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2023, 04:02 PM IST
 Ketu Gochar 2023: కేతు గ్రహం సంచారంతో ఈ రాశులవారు విపరీతమైన సంపదను పొందబోతున్నారు!

Ketu Rashi Parivartan: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కేతువు గ్రహాన్ని చెడు గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం అన్ని గ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే కేతు గ్రహం కూడా కాలానుగుణంగా రాశి సంచారం చేస్తుంది. జాతకం ప్రకారం కేతువు శుభ స్థానంలో ఉంటే..వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. అయితే కేతువు గ్రహం చెడు స్థానంలో ఉంటే జీవితం దుఃఖమయంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అక్టోబరు నెలలో కేతువు గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం అక్టోబర్ 30న జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై కేతు గ్రహ ప్రభావం:
మేష రాశి: 

కేతువు రాశి సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. 

వృశ్చిక రాశి:
కేతువు సంచారం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి పదకొండవ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీని కారణంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా మీ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యంపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కర్కాటక రాశి:
అక్టోబర్ నెలలో కేతువు సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎదైన పని ప్రారంభించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో సోదరుల మద్దతు లభించే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కేతువు సంచారంతో డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. వీరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News