Chandrababu Case Updates: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కేసులో ఇవాళ ఏం జరగనుందోననే ఆసక్తి మొదలైంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్, ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటీషన్లపై ఇవాళ జరిగే వాదనలు కీలకం కానున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించి ఇవాళ లిస్టింగ్ ఇస్తానని పేర్కొంది. అన్ని విషయాలు పిటీషన్‌లో ప్రస్తావించాలని చంద్రబాబు న్యాయవాది లూథ్రాకు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూచించారు. క్వాష్ పిటీషన్ విచారణకు స్వీకరించే అంశంపై ఇవాళ స్పష్టత రానుంది.
మరోవైపు చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం, అంగళ్లు విధ్వంసం కేసులో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. దీనికోతోడు ఏసీబీ కోర్టులో కస్డడీ పొడిగింపు కోరుతూ సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. అటు బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు.
మొత్తానికి ఇవాళ చంద్రబాబు కేసులో అటు బెయిల్ పిటీషన్, ఇటు కస్టడీపై నిర్ణయం వచ్చే అవకాశాలుండగా, సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై విచారణ జరగనుంది. రెండవసారి చంద్రబాబుకు రిమాండ్ పొడిగించడంతో సెప్టెంబర్ 9 వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook