భూమ్మీద అత్యంత స్వచ్ఛమైన తినే ఆహారం ఏంటో తెలుసా..? దీని వలన అనేక లాభాలు కూడా..!

ఈ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన ఆహారం ఏంటో తెలుసా..? ఈ ఆహారాన్ని శతాబ్దాలుగా మన ఇళ్లల్లో ఉపయోగించబడుతోంది. ఆ స్వచ్ఛమైన ఆహరం ఏంటో.. దాని విశేషాలేంటో ఇపుడు చూద్దాం!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 08:53 PM IST
భూమ్మీద అత్యంత స్వచ్ఛమైన తినే ఆహారం ఏంటో తెలుసా..? దీని వలన అనేక లాభాలు కూడా..!

Ghee Benefits: తినటానికి ప్రపంచంలో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు ఉన్నాయి. ప్రజలు ఆహారంగా పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు, అన్నం వంటి ఆహారాలను భోజనంలో చేర్చుకుంటారు.కానీ భూమి మీద స్వచ్ఛమైన ఆహారం ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా..? కొంత మంది పండ్లు, కూరగాయలు స్వచ్చమైనవిగా భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.. ప్రపంచంలో అన్నిటికంటే శుద్దమైన ఆహార పదార్ధం చాలా మంది వారి వంటల్లో ఉపయోగిస్తారు. ఇపుడు దాని గురించి తెలుసుకుందాం. 

భూమి పైన శుద్ధమైన ఆహరం నెయ్యి.. 
బీబీసీ నివేదిక ప్రకారం.. భూమిపై అత్యంత స్వచ్ఛమైన ఆహారం 'నెయ్యి'. కొంతమంది నెయ్యిని ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు. కానీ వేలాది సంవత్సరాలుగా నెయ్యి ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. కానీ కొన్ని దశాబ్దాలుగా నెయ్యిలోని శాచురేటెడ్  కొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదు అని నమ్ముతారు. కానీ ఇప్పుడు శాచురేటెడ్ కొవ్వు గురించి ప్రజల ఆలోచన మారడం వల్ల, భారతీయుల నెయ్యిపై అభిప్రాయం మారుతూ వస్తుంది. 

కరోనా తర్వాత పెరిగిన వినియోగం.. 
ప్రజలు నెయ్యిని వినియోగించడం తిరిగి ప్రారంభించారు.  కరోనా సమయంలో దీని ప్రాముఖ్యత పెరిగింది మరియు ప్రజలు ఆహార విషయాల్లో శ్రద్ధ వహించడం ప్రారంభించారు. సహజ నెయ్యి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బయట కూడా లభిస్తుంది. మన దేశంలో నెయ్యికి- మన సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. 

Also Read: Best selling mobiles under Rs 10000: జస్ట్ రూ. 10 వేల లోపే వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

25 నుండి 30 శాతం పెరిగిన డిమాండ్
భారతదేశంలో నెయ్యి ఉత్పత్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అందిన నివేదిక ప్రకారం.. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత నెయ్యికి డిమాండ్ 25 నుండి 30 శాతం పెరిగింది. నెయ్యి ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదు.. దీనిని మనం చేసే దేవుడి పూజకి కూడా ఉపయోగిస్తుంటాం. దీని వినియోగం పరంగా చూస్తే నెయ్యి ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉందనే చెప్పాలి. పురాణాల ప్రకారం.. వేద దేవుడు అయినట్టి ప్రజాపతి దక్షుడు తన రెండు చేతులను రుద్దడం ద్వారా మొదటిసారిగా నెయ్యిని తయారు చేశాడు. ఈ నెయ్యిని అగ్నిలో వేసి తన పిల్లలను సృష్టించాడు. 

మన విశ్వాసంతో ముడిపడింది.. 
ఇది కాకుండా.. నెయ్యికి భారతీయ సంస్కృతితో లోతైన సంబంధం ఉంది. మన దేశంలో హిందూ వివాహాల నుండి జరిగే అన్ని రకాల శుభకార్యాలకు నెయ్యిని హోమ గుండంలో సమర్పించబడుతుంది. ఇది కాకుండా, ఆయుర్వేదంలో నెయ్యి దివ్యౌషధంగా  కూడా పరిగణించబడుతుంది. నెయ్యిలో ఉండే పోషక గుణాల కారణంగా చాలా మంది ఇంట్లో ఉపయోగిస్తారు. 

Also Read: Diabetes Remedy: ఈ జ్యూస్ రోజూ తాగితే చాలు మధుమేహం ఎంత ఉన్నా..ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News