Mars Ketu Yuti 2023: అక్టోబర్ నెలలో పెద్ద పెద్ద గ్రహాలు సంచారం చేయబోతున్నాయి దీని కారణంగా నెల మొత్తం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే విధంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యమైన కుజ గ్రహం ఇదే నెలలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులను వెంటాడుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహం అక్టోబర్ 18వ తేదీన కన్య రాశిలోకి సంచారం చేసింది.. ఆ తర్వాత అక్టోబర్ మూడున తులారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడి వారికి శుభప్రదంగా మారబోతోంది. అంతేకాకుండా త్వరలోనే మంచి రోజులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో తప్పకుండా కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాలపరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అంతేకాకుండా కన్యారాశిలో ఇప్పటికే అంగారక గ్రహం కూడా సంచారం చేసింది అయితే ఇదే సమయంలో కేతువు కూడా కలవబోతోంది. దీంతో 12 రాశుల వారిపై మరింత ప్రత్యేకమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఈ ప్రభావం కారణంగా సింహ రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు వ్యాపారాలపరంగా పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇంతకుముందు పరిస్థితుల కంటే ఇప్పుడు మరింత లాభం చేకూర్చే విధంగా అవకాశాలు ఉన్నాయి.
ఇక కన్యారాశి వారి విషయానికొస్తే వీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతోపాటు ఉత్తమమైన జీవితాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా సమయాన్ని ఆర్థిక విషయాలపై వినియోగించుకోవడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ సోదరుల మద్దతు లభించి వ్యాపారాలు మరింత లాభదాయకంగా కూడా మారవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి