/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Supreme Court: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసు విషయంలో అక్టోబర్ 3 మంగళవారం అత్యంత కీలకం కానుంది. జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ఏం చేయనుందనే ఆసక్తి సర్వత్రా విన్పిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వెంటనే తన అరెస్ట్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పించారు. అయితే సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసి రిమాండ్ విధించింది. ఆ తరువాత చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇదే క్వాష్‌పై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో సిద్ధార్థ్ లూధ్రాతో పాటు హరీష్ సాల్వే కూడా వాదనలు విన్పించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

వాస్తవానికి సుప్రీంకోర్టులో మొన్న బుధవారమే విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ ధర్మాసనంలో జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మి కారణాన్ని ప్రస్తావించడంతో విచారణ వాయిదా పడింది. భట్టి సభ్యుడిగా లేని బెంచ్ ముందు విచారణకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రయత్నించారు. అయితే కేసు అత్యవసర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని త్వరగా విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దాంతో కేసును జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్‌కు బదిలీ చేసి విచారణను అక్టోబర్ 3 మంగళవారానికి వాయిదా వేశారు. 

ఏపీ ప్రభుత్వం కూడా తన వాదనల్ని ఈ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.ఇరువర్గాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అక్టోబర్ 3కు వాయిదా వేశారు. ఇప్పుడు మంగళవారం ఏం జరగనుందోననే ఆసక్తి మొదలైంది. 

Also read: Chandrababu Case: ఇన్నర్ కేసులో లోకేశ్‌కు సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Chandrababu quash petition hearing in supreme court on october 3, tension in tdp leaders what is going to happen
News Source: 
Home Title: 

Supreme Court: చంద్రబాబు క్వాష్‌పై మంగళవారం ఉత్కంఠ, ఏం జరగనుంది

Supreme Court: చంద్రబాబు క్వాష్‌పై మంగళవారం ఉత్కంఠ, ఏం జరగనుంది
Caption: 
Chandrababu ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Supreme Court: చంద్రబాబు క్వాష్‌పై మంగళవారం ఉత్కంఠ, ఏం జరగనుంది
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, September 30, 2023 - 20:25
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
57
Is Breaking News: 
No
Word Count: 
257