Aston Martin: తుపాను మించిన వేగం, రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఏస్టన్ మార్టిన్ కొత్త కారు లాంచ్, ధర ఎంతంటే

Aston Martin: తుపాను మించిన వేగంతో, రాకెట్ వేగంతో దూసుకుపోయే అత్యాధునిక కారు ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఎంట్రీ ఇచ్చిన ఈ కారు ఇప్పుడు దేశంలో అందుబాటులోకి వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2023, 10:57 AM IST
Aston Martin: తుపాను మించిన వేగం, రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఏస్టన్ మార్టిన్ కొత్త కారు లాంచ్, ధర ఎంతంటే

Aston Martin: ఏస్టన్ మార్టిన్. ప్రపంచంలోనే సూపర్ కార్‌గా పేరుగాంచింది. ఇప్పుడీ కంపెనీ తన కొత్త కారు DB12 ఇండియాలో లాంచ్ చేసింది. తుపాను మించిన వేగంతో దూసుకెళ్లగలిగే ఈ కారు వేగం చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశపెట్టగా ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేశారు.

ఏస్టన్ మార్టిన్ DB11 స్థానంలో ఈ కారు వచ్చి చేరింది. ఈ కారు ధర కేవలం 4.59 కోట్ల రూపాయలు మాత్రమే. మార్కెట్‌లో ఈ కారుకు పోటీగా బెంట్‌లే కాంటినెంటల్ జీటీ, ఫెరారీ రోమా ఉన్నాయి. ఈ రెండు కార్లు ధరలు వరుసగా 3.29 కోట్లు, 3.79 కోట్లుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. DB12లో కొత్త మెర్సిడెజ్ ఏఎంజీ సోర్స్డ్ 4 లీటర్ ట్విట్ టర్బో వీ8 ఇంజన్ ఇచ్చారు. ఇది చాలా అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. ఈ కారు ఇంజన్ 671 బీహెచ్ పి, 800 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. ఈ సూపర్ కారు కేవలం 3.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటలు 325 కిలోమీటర్లు. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. జీటీ, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ ఉన్నాయి. స్పోర్ట్ ప్లస్ మోడ్ అయితే తుపానుకు మించిన వేగంతో దూసుకెళ్తుంది. 

ఈ కారుకు మరింత ఎక్కువగా మస్క్యులర్ లుక్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ కారు ముందు భాగంలో అతిపెద్ద గ్రిల్, కొత్త లుక్‌తో హెడ్ లైట్స్ ఉన్నాయి. కారులో స్టాండర్డ్‌గా 21 ఇంచెస్ వీల్ ఉంది. ఇందులో కాస్ట్ ఐరన్ 400 ఎంఎం ఫ్రంట్ డిస్క్ , 360 ఎంఎం రేర్ డిస్క్ ఉన్నాయి. ఏస్టన్ మార్టిన్‌లో కొత్త సస్పెన్స్ సెటప్ కూడా ఉంది. ఇది ఎడాప్టివ్ డేంపర్స్, స్టిఫర్ యాంటీ రోల్ బార్స్ , ఎలక్ట్రానిక్ రేర్ ఢిఫరెన్షియల్ ఉన్నాయి. 

ఏస్టన్ మార్టిన్ DB12 ఇంటీరియర్ కూడా చాలా మారిందని చెప్పవచ్చు. DB11లో ఉండే పాత మెర్సిడీజ్ లాంటి ఇన్‌ఫోటైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఉండేది. దీనిని తొలగించి ఇప్పుడు కొత్త 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అమర్చారు.

Also read: Gas Cylinder Price: మళ్లీ భారీగా పెరిగిన గ్యాస్ ధర, సిలెండర్‌పై 200 రూపాయలు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News