Plants To Keep Snakes Away From Your Home: ఇంట్లోకి పాములు చొరబడితే ఆ పామును పట్టుకోవడానికి నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. లేదంటే ఆ పాము ఎప్పుడు, ఎటువైపు నుండి వచ్చి కాటేస్తుందో అనే భయం స్థిమితంగా ఉండనివ్వదు. కానీ మీ ఇంటి ఆవరణలో కానీ లేదా పెరట్లో కానీ ఇలాంటి మొక్కలు పెంచితే.. పాములు మీ ఇంటివైపు కూడా రావు అని స్నేక్ సైన్స్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. పాములకు హాని చేయకుండా అసలు పాములను ఇంటివైపులకే రాకుండా చేయడానికి ఈ మొక్కల పెంపకం ఐడియా బాగుంది కదా.. ఇంతకీ ఆ మొక్కలు ఏంటి అనే కదా మీ సందేహం.. అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
తులసి మొక్కలు :
తులసి మొక్క అత్యంత పవిత్రమైన మొక్క అనే విషయం తెలిసిందే. తులసి మొక్కను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అని అనాదిగా ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాదు.. చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే.. మీ పెరట్లో లేదా మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కలు ఉంటే.. వాటి నుండి వెలువడే ఒక రకమైన ఘాటు వాసనకు పాములు మీ ఇంటివైపునకు కూడా రావు.
బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కలు :
పాములు బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి మొక్కలకు దూరంగా ఉంటాయి. బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కల ఆకులు, కాడలకు ముండ్లు ఉండటంతో అవి తమకు హాని చేస్తాయి అనే భయంతో పాములు దూరం జరిగిపోతుంటాయి.
హాల్లీ ట్రీ :
హాల్లీ మొక్కల ఆకుల అంచులు ముండ్ల ఆకారంలో ఉండటంతో ఆ చెట్ల వద్దకు వెళ్తే తమకు హాని జరుగుతుంది అనే భయంతో పాములు వాటికి దూరం జరిగిపోతుంటాయి.
గోధుమ గడ్డి :
ఇటీవల కాలంలో చాలామందికి గోధుమ గడ్డిపై చాలా అవగాహన ఏర్పడింది. గోధుమ గడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి గోధుమ గడ్డితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలే తెలుసు కానీ ఇది పాములను దూరం పెట్టే స్నేక్ రిపల్లెంట్‌గానూ పని చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. గోధుమ గడ్డి నుండి వెలువడే ఒక రకమైన ఆమ్లాల వాసన పాములను ఆ ప్రదేశంలోకి రానివ్వకుండా చేస్తుంది.
మారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్ / బంతి పూల మొక్కలు :
బంతి పూల మొక్కలు నెంబర్ 1 స్నేక్ రిపల్లెంట్‌గా పనిచేస్తాయి. బంతి పూలు లేదా బంతి పూల మొక్కల నుండి ఒక రకమైన గాఢమైన ఘాటు వాసన వెలువడుతుంది. ఆ వాసన పాములను అటువైపు రాకుండా చేస్తుంది.
మాచిపత్రి మొక్కలు:
మాచిపత్రి మొక్కల ఆకుల నుండి వెలువడే ఘాటైన వాసన పాములను ఆ ఇంటి దరిదాపుల్లోకి రానివ్వకుండా చేస్తుంది.
ఉల్లిగడ్డ, వెల్లుల్లి :
ఉల్లిగడ్డ, వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. అవి వెదజల్లే ఘాటు వాసన పాములను దూరంగా తరిమి కొడుతుంది. వీటిలో సల్ఫోనిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి పాములను దూరం పెడుతాయి.
ఇది కూడా చదవండి : Common Krait Viral Video: ప్రాణాంతకమైన పామును పట్టిన ప్రముఖ స్నేక్ క్యాచర్.. వీడియోని చూస్తే ఆశ్చర్యపోతారు..
పింక్ ఆగపంతస్ ప్లాంట్స్ :
పింక్ ఆగపంతస్ ప్లాంట్స్ కూడా ఉల్లిగడ్డ జాతికే చెందిన మొక్కలు. పింక్ ఆగపంతస్ మొక్కలు కూడా ఉల్లిగడ్డ తరహాలోనే ఘాటు వాసనను వెదజల్లుతాయి. అందుకే పాములు ఆ దరిదాపుల్లోకి వచ్చే ధైర్యం చేయవు.
ఇది కూడా చదవండి : Giant Python Snake in Tirumala: తిరుమలలో భారీ కొండ చిలువ.. హడలిపోయిన జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి