Ponnala Lakshmiah Resigned To Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు. "అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నాలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాంటిమెంట్ కోసం వేచిచూడడం దురదృష్టకర పరిణామం. నేను ఢిల్లీకి వచ్చి 10 రోజులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసిచేణుగోపాల్ గారిని కలుద్దాం అంటే కనీసం ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు.
బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీట్లు కేటాయించాలని కోరేందుకు ఢిల్లీకి బీసీ టీమ్ నాయకులు 50 మంది వెళితే ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం అవమానకరం. తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక. ఇక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అగ్ర నాయకుల చుట్టూ బీసీ తిరిగితే పార్టీ పరువు పోతుంది. నేను 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం పెట్టిన వాణ్ణి.. తెలంగాణ కోసం నేను మొదటి నుంచి నా వంతు చిత్తశుద్ధితో పని చేసాను. రాష్ట్రంలో 12 ఏళ్ళు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసాను పార్టీలో అనేక పదవులను అత్యంత నిబద్ధతగా, క్రియాశీలకంగా, పార్టీ కోసం అంకితభావంతో 40 ఏళ్లుగా పని చేసిన నాకే ఇంత అవమానం జరిగితే పార్టీ లో సగటు బీసీ నేతపరిస్థితి ఊహిస్తేనే భయం అవుతుంది.
ఎవరో డబ్బులు ఇచ్చారని బీసీ నాయకులు పనికిరారు, వాళ్ళు ఓడిపోయే వాళ్ళు అంటూ టికెట్లు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి, డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెపుతూ పార్టీని అమ్మకానికి పెట్టి ఒక ఒక వ్యాపార వస్తువుగా మార్చి వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వాళ్ళు పార్టీకి బజార్లో గొడ్లను అమ్మినట్టు పార్టీ టికెట్లను అమ్మకుంటున్నారు.
పార్టీలో జరుగుతున్న ఈ వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతుంది. ఒకవైపు అధికార బీఆర్‌ఎస్ పార్టీలో చిన్న చిన్న బీసీ కూలలను కూడా గుర్తించి వారికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్బోరేషన్ పడవులు పార్టీ పదవులు ఇస్తుంటే మన దగ్గర పార్టీలో పీసీసీఅధ్యక్ష పదవులు నిర్వహించిన వారికి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా కనీసం మాట్లాడేందుకు అగ్రనాయకులు కలవకపోవడం తెలంగాణ సమాజంలో కాంగ్రేస్పీసీ నాయకుల పట్ల చాలా చిన్న చూపుగా మారింది.
పార్టీలో గొప్ప గొప్ప సిద్ధాంతాలు రాసుకుంటాం ఉదయపూర్ డిక్లరేషన్, రాయపూర్ ప్రకటనలు ఎన్నో నిబంధనలు పెట్టారు. సీనియర్‌లను గౌరవిస్తాం అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారినిగుండెల్లో పెట్టుకుంటాం అన్నారు. కొత్తగా వచ్చిన వారు 5 ఏళ్ళు పార్టీలో పని చేస్తేనే పదవులు అన్నారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్ చేసిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
కానీ నేడు పార్టీలో జాయిన్ కాకముందే టికెట్లను అమ్మకుంటున్నారు. ఎవరో వ్యూహకర్త చెప్పిందే ఫైనల్ అంటూ, సర్వేలలో మీ పేరు లేదు అంటూ ఒక అనామకుడు చెప్పింది వింటూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పార్టీలో అవమానాలు భరిస్తూ మనుగడ సాధింలేమన్న ఆవేదనతో నేను పార్టీతో నాకు ఉన్నఅనుబంధాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకాలం పార్టీలో నాకు పదవులు ఇచ్చి ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.." అని పొన్నాల లక్ష్మయ్య లేఖలో పేర్కొన్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరనున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి