Sai Dharam Tej Birth day: మాస్ అవతారంలో సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్‌' గ్లింప్స్‌ అదుర్స్..

SDT17: సాయిధరమ్ తేజ్ నయా మూవీ గాంజా శంకర్. ఇవాళ సాయి తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గాంజా శంకర్ నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 11:13 PM IST
Sai Dharam Tej Birth day: మాస్ అవతారంలో సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్‌' గ్లింప్స్‌ అదుర్స్..

Sai Dharam Tej New Movie:  సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అది కాస్తా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో డైరెక్టర్ సంపత్ నందితో ఓ సినిమాను ప్రకటించాడు. నిన్న ఈ మూవీ ఫ్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇవాళ సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 

''చిన్నప్పుడే స్కూల్‌ ఎగ్గొట్టేసి.. అమ్మానాన్నల మాటను పెడచెవిన పెట్టి.. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ.. అన్ని చెడు అలవాట్లను ఒంటికంటించుకుని.. పది రూపాయలుంటే పార్కులో.. పది వేలుంటే పార్క్‌ హయత్‌లో ఉండే ఒక అల్లర చిల్లరగా పెరిగిన మనిషి గాంజా శంకర్‌. అలాంటి మనిషి కథ ఎలా ఉండబోతుంది'' అన్న కాన్సెప్ట్‌తో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ ఊరమాస్‌ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాత వ్యవహారిస్తున్నారు. 

సితార సంస్థతో కలిసి త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై గాంజా శంకర్‌ను నిర్మిస్తుంది. ధమకా, బలగం సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భీమ్స్‌ ఈ సినిమాకు స్వరాలు అందించబోతున్నాడు. సాయితేజ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. 

Also read: Divya Prabha: విమానంలో నటికి వేధింపులు.. మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News