India Vs England World Cup 2023 Highlights: వరల్డ్ కప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. తక్కువ లక్ష్యాన్ని టీమిండియా బౌలర్లు అద్భుతంగా కాపాడారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (87), సూర్యకుమార్ యాదవ్ (49), కేఎల్ రాహుల్ (39) రాణించారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టకలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. ఇంగ్లాండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములతో ఇంటిముఖం పట్టింది. వరల్డ్ కప్‌లో 20 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్‌ను భారత్ ఓడించడం విశేషం. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
భారత్ విధించిన 230 పరుగుల లక్ష్యంలో బరిగిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ఐదో ఓవర్లో డేవిడ్ మలన్ (16), జోరూట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు జస్ప్రీత్ బుమ్రా . ఆ తరువాత బెన్ స్టోక్స్ (0), బెయిర్‌స్టో (14)ను మహ్మద్ షమీ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అనంతం వికెట్లు తీసే బాధ్యత కుల్దీప్ యాదవ్ తీసుకున్నాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (10) అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. 52 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరింది.
మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ కాసేపు జాగ్రత్తగా ఆడారు. అయితే 24వ ఓవర్లో మొయిన్ అలీ (15)ని షమీ ఔట్ చేయడంతో 81 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆరో వికెట్ పడింది. తరువా క్రిస్ వోక్స్ (10), లివింగ్‌స్టోన్ (27), ఆదిల్ రషీద్ (13), మార్క్ వుడ్ (0)తో వరుసగా పెలివియన్‌కు క్యూకట్టారు. దీంతో ఇంగ్లిష్ జట్టు మొత్తం 129 పరుగులకే ఆలౌట్ అయింది. డేవిడ్ విల్లీ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బుమ్రా బౌలింగ్‌లో రెండు చక్కటి సిక్సర్లు బాదాడు. టీమిండియా బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముంద టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమైనా.. రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. కేఎల్ రాహుల్ (39), సూర్యకుమార్ యాదవ్ (49)తో కలిసి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. భారీ హిట్టర్లు ఉన్న ఇంగ్లాండ్.. ఈ 230 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తాపడింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా
Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి