Shruti Haasan:సలార్ ప్రభాస్, ప్రశాంత్ సినిమానే.. నాది కాదు: శృతిహాసన్

Salaar: ప్రస్తుతం వస్తూ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా తనది కాదు అంటూ శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 06:26 PM IST
Shruti Haasan:సలార్ ప్రభాస్, ప్రశాంత్ సినిమానే.. నాది కాదు: శృతిహాసన్

Shruti Haasan:శృతిహాసన్ తన సినిమాల కన్నా కూడా తన ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా అభిమానులకు ఎక్కువ దగ్గరగా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్. అంతేకాకుండా ఈ హీరోయిన్ కి సినిమా ఛాన్సులు తగ్గతాయేమో అని అందరూ అనుకున్న టైంలో ఏకంగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య అలానే బాలకృష్ణతో వీర సింహారెడ్డి అని రెండు సూపర్ హిట్లు అందుకొని అందరి ఆలోచనలను తారుమారు చేసింది. అంతేకాదు ఫైనల్ గా ప్రభాస్ తో ఛాన్స్ కూడా కొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

 

ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ లో నటిస్తోంది. ఈ సినిమా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తూ ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రుతిహాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆమె వైపు తిప్పుకున్నాయి.

 

అసలు విషయానికి వస్తే మామూలుగా స్టార్ హీరోల సినిమాలు అంటే అభిమానులు ఆ హీరోల గురించే ఎక్కువ ఆలోచిస్తారు తప్ప ఆ సినిమాలోని హీరోయిన్ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఇక ఇప్పుడు అదే పరిస్థితి శృతిహాసన్ కి కూడా ఎదురైంది. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ అయినప్పటికీ కూడా .. ఆ సినిమా గురించి వచ్చినప్పుడు ప్రభాస్ లేదా ప్రశాంత్ నీల్ గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప శృతిహాసన్ గురించి ఎవరు ఎత్తడం లేదు.

 

ఈ నేపథ్యంలో  పదే పదే సలార్ అనేది ప్రభాస్ సినిమా అని అంటుంటే మీకు బాధగా ఉండదా?అని మీడియా ప్రతినిధి ఒకరు శృతిహాసన్ ని ప్రశ్నించారు. దానికి శ్రుతి హాసన్ తనదైన స్టైల్ లో జవాబు ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ' సలార్ ప్రభాస్ సినిమానే కదా.. సలార్ ప్రభాస్, ప్రశాంత్ సినిమానే.. సలార్ నాది కాదు.. అందరిదీ.. ఆ సినిమాలో నేను కూడా నేను భాగం అంతే.. వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రభాస్ సలార్ సినిమానే అవుతుంది.. అందుకే సలార్ ప్రభాస్ సినిమా అని చెప్పుకుంటే నాకేం బాధగా లేదు అని' అందరికీ క్లారిటీ ఇచ్చేసింది ఈ హీరోయిన్.

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News