Pakistan Vs New Zealand Highlights: పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (108) మరో సెంచరీ అదరగొట్టగా.. గాయం తరువాత జట్టులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95) దుమ్ములేపాడు. అనంతరం పాకిస్థాన్ 25.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో పాక్‌ను విజేతగా ప్రకటించారు. పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (126) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ బాబర్ అజామ్ (66) అర్ధ సెంచరీతో మెరిశాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది నాలుగు విజయం కాగా.. కివీస్‌కు నాలుగో ఓటమి.
న్యూజిలాండ్ విధించిన 402 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే అబ్దుల్లా షఫీక్ (4) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఫఖర్ జమాన్‌కు తోడైన బాబర్ అజామ్ కివీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జమాన్ వేగంగా ఆడితే.. బాబర్ చక్కగా సహకరించాడు. సిక్సర్లు, ఫోర్లతో ప్రేక్షకులను అలరించారు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట 22వ ఓవర్ సమయంలో వర్షం అంతరాయం కలిగించగా.. లక్ష్యాన్ని కుదించారు. 41 ఓవర్లలో 342 పరుగుల లక్ష్యాన్ని అందించారు.
అప్పటికి పాక్ 19.3 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆట ఆరంభమైన తరువాత మళ్లీ భారీ వర్షం కురిసింది. పాక్ స్కోరు 25.3 ఓవర్లలో 200 పరుగులుగా ఉంది. ఇదే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 179 రన్స్ చేసింది. దీంతో కివీస్ కంటే 21 పరుగులు చేసిన పాక్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 126 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్సర్లు), బాబార్ అజామ్ (63 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పాక్ విజయంలో కీరోల్ ప్లే చేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. పాక్ బౌలర్లపై ఎదురుదాటికి దిగింది. కెప్టెన్ విలియమ్సన్ జట్టులోకి రావడంతో సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ బ్యాట్‌మెన్ రచిన్ రవీంద్ర ఓపెనర్‌గా వచ్చాడు. డేవిడ్ కాన్వే (35) పర్వాలేదనిపించగా.. రచిన్ (94 బంతుల్లో 108, 15 ఫోర్లు, ఒక సిక్స్) టోర్నీలో మూడో సెంచరీని నమోదు చేశాడు. కేన్ విలియమ్సన్ 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో మిగిలిన బ్యాట్స్‌మెన్ తలో చేయి వేయడంతో కివీస్ 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది 90 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేకపోగా.. హరీస్ రవూఫ్ 1/85, హసన్ అలీ 1/82 గణంకాలు నమోదు చేసుకున్నారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!
Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook