Amla Benefits: చలికాలంలో ఉసిరికాయలు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తాయి. ఇదే సమయంలో చాలా మంది వీటి చట్నీలు కూడా తయారు చేసుకుంటారు. ఈ ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి లోపం సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఉసిరిలో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని చలి కాలంలో తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రతి రోజు ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి ఉసిరి ప్రయోజనకరంగా ఉంటుంది. చలి కాలంలో చాలా మందిలో ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడతాయి.
చలి కారణంగా వచ్చే దగ్గు, దమ్ము:
చలి కాలంలో జలుబు, దగ్గు, దమ్ము సమస్యలు రావడం సర్వసాధారణం. అంతేకాకుండా ఇదే సమయంలో విటమిన్ సి లోపం సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండానికి క్రమం తప్పకుండా ఉసిరి తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పకుండా కూడా ఉంటారు.
జీర్ణక్రియను ఆరోగ్యంగా చేస్తుంది:
ఉసిరిలో పాలీఫెనాల్స్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉసిరిని ఆహారాల్లో వినియోగించడం వల్ల వాతావరణంలో తేమ పెరగడం కారణంగా కలిగే జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సులభంగా వైరస్ కారణంగా వచ్చే బ్యాక్టీరియ కూడా తొలగిపోతుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి:
రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు చర్మం, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. హిమోగ్లోబిన్ కోరత కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు ఉసిరి రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి.
జీర్ణక్రియ సమస్యలు:
శీతాకాలంలో అనారోగ్యకరమైన ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా మందిలో పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మలబద్ధకం, ఉబ్బరం, ఎసిడిటీ సమస్యల బారిన కూడా పడతారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉసిరి రసం తాగాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook