World Cup 2023 Semifinal: ప్రపంచకప్ 2023 టోర్నీలో ఇవాళ చిట్ట చివరి లీగ్ మ్యాచ్ బెంగళూరు వేదికగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. ఇక నాకౌట్ దశలో మొదటి సెమీఫైనల్ నవంబర్ 15న, రెండవ సెమీఫైనల్ నవంబర్ 16న జరగనున్నాయి. టోర్నీ ఫైనల్ నవంబర్ 19 ఆదివారం జరగనుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ పోరు ఎలా ఉంటుంది, పిచ్ దేనికి అనుకూలమనే వివరాలు తెలుసుకుందాం.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మొదటి సెమీఫైనల్ ముంబై వాంఖేడ్ స్డేడియంలో నవంబర్ 15న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఆ తరువాత నవంబర్ 16న రెండవ సెమీపైనల్ కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా జరగనుంది. ఇక ఫైనల్ పోరు నవంబర్ 19న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో ఉంటుంది. ఇవాళ మొత్తం టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో , రెండు మూడు స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు ఫైనల్ స్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు లీగ్ దశలోనే వైదొలిగాయి.
ఇక మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్ ఈనెల 15వ తేదీన ముంబైలోని వాంఖేడ్ స్డేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతుంది. వాంఖేడ్ స్డేడియం నిస్సందేహంగా ఇండియాకు చాలా చాలా అనుకూలమైన పిచ్ అని చెప్పవచ్చు. ఇది బ్యాటింగ్ పిచ్ కానీ క్రమంగా బౌలర్లకు అనుకూలిస్తుంది. అందుకే మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలెక్కువగా ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు సాధించవచ్చు.
లీగ్ దశలో ఇండియా వర్సెస్ శ్రీలంక తలపడినప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేయగలిగింది. ఆ తరువాత బౌలర్లకు అనుకూలించినందువల్ల కావచ్చు శ్రీలంక 19.5 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఈసారి సెమీస్ ప్రత్యర్ధి న్యూజిలాండ్ కావడం వల్ల ఇండియాకు నల్లేరుపై నడక కాకపోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ నిస్సందేహంగా పటిష్టమైన జట్టు. మరోవైపు నాకౌట్ దశలో 2016 నుంచి ఇండియా ప్రతిసారీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతూనే ఉంది. 2016 నుంచి ఐసీసీ నౌకౌట్స్‌లో రెండు జట్లు ఐదుసార్లు తలపడగా అన్నిసార్లు ఇండియానే ఓడిపోయింది.
తాజాగా 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్ న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమిపాలైంది. 2021 ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కూడా అదే పరిస్థితి. ఇక టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే అనుభవం. ఇప్పుడు కూడా సీన్ రిపీట్ అవుతుందా లేక సీన్ రివర్స్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.
Also read: World Cup 2023: ప్రపంచకప్ 2023 చివరి లీగ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ నేడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook