Most Popular Apps of 2022: ప్రస్తుతం మనిషి జీవితంలో తిండి నిద్ర ఎంత ముఖ్యమైపోయాయో స్మార్ట్ ఫోన్స్ కూడా అంతే ముఖ్యమైపోయాయి అనడం లో అతిశయోక్తి లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే గంట కూడా గడవడం. ఇక మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే సరిపోదు కదా ఆ ఫోన్ లో మనం వారే యాప్స్ అన్ని కూడా తప్పనిసరి. మొబైల్ ఫోన్ కనిపెట్టింది కాల్స్ కోసమే అయినా.. ప్రస్తుతం మనం కాల్స్ మాట్లాడేది ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో.. మిగతా టైం అంతా ఏదో ఒక యాప్ తో గడుపుతూ ఉంటాం.
ఇప్పటికే పెరుగుతున్న డిమాండ్ వల్ల మన మొబైల్ ఫోన్స్ కోసం రోజుకో యాప్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి..2022లో విపరీతమైన జనాదరణ పొందిన యాప్స్ ఏవి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..
2020లో భారత్ నిషేదించిన 'టిక్‌టాక్' 2022 సంవత్సరంలో అత్యధిక డౌన్లోడ్ పొందిన పాపులర్ యాప్ గా నిలిచింది. ఈ అప్లికేషన్ ని దాదాపు 672 మిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. బిజినెస్ ఆఫ్ యాప్స్ ప్రకారం దీని వార్షిక ఆదాయం 9.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అనగా మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 783 వేల కోట్ల కంటే ఎక్కువ.
ఇక ఆ తరువాత టాప్ 6 యప్స్ ని గమనిస్తే.. 547 మిలియన్స్ తో ఇంస్టాగ్రామ్ రెండో ప్లేస్ దక్కించుకుంది.
449 మిలియన్స్ తో మనము ఎప్పటినుంచో ఇష్టపడుతున్న ఫేస్ బుక్ మూడో స్థానంలో నిలిచింది.
424 మిలియన్స్ తో మనం రోజు వాడే వాట్సాప్ నాలుగవ స్థానంలో నిలవగా.. తరువాత 5, 6 స్థానాలలో టెలిగ్రామ్ 310 మిలియన్స్ తో, ఫేస్‌బుక్ మెసెంజర్ 210 మిలియన్స్ తో నిలబద్దాయి.
ఇక గేమ్స్ విభాగంలో ఎక్కువ మంది ఇష్టపడి డౌన్ లోడ్ చేసుకున్న యాప్ గా 'సబ్వే సర్ఫర్స్' మొదటి స్థానం దక్కించుకుంది. దీనిని 304 మిలియన్ల వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత 'క్యాండీ క్రష్' ఉంది. ఈ యాప్ ను 138 మిలియన్ల యూజర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం.
మరోపక్క షాపింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా 'షీఇన్'. ఈ షాపింగ్ అప్లికేషన్ 229 మిలియన్ల వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 210 మిలియన్ డౌన్లోడ్స్ తో మీషో (Meesho) నిలిచింది.
ఇక ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిపోవడంతో
మనీ ట్రాన్స్‌ఫర్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్న యాప్‌గా 94 మిలియన్ల డౌన్‌లోడ్స్ తో 'ఫోన్ పే' (PhonePe) నిలిచింది. ఆ తరువాత 69 మిలియన్ డౌన్లోడ్స్ తో గూగుల్ పే రెండో స్థానంలో నిలవగా.. 60 మిలియన్స్ డౌన్‌లోడ్స్ తో పేటియం మూడో స్థానంలో నిలిచింది.
ఇక ఫుడ్ విభాగంలో ఎంసీడోనాల్డ్ (127 మిలియన్స్), మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై (238 మిలియన్స్), ట్రావెల్ విభాగంలో గూగుల్ మ్యాప్ (113 మిలియన్స్),ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో స్వెట్‌కాయిన్ (52 మిలియన్స్) , విద్యకు సంబంధించిన యాప్‌లో డుయోలింగో (98 మిలియన్స్) అగ్ర స్థానాల్లో నిలిచాయి.
Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook