డెహ్రాడూన్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై సీనియర్లు, సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురు విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నారు. హాస్టల్‌లో ఉండే బాలిక..అనారోగ్యం (జ్వరం)తో ఉండగా అత్యాచారం చేశారని తన సోదరికి చెప్పింది. ఆమె గర్భవతి అని తెలిశాక..ఆమెపై ఈ అఘాయిత్యం జరిగిందని వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 14న, స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు తనను స్టోర్ రూమ్‌కి పిలిచి అత్యాచారానికి తెగబడినట్లు ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది.
'నెల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్కూల్ యాజమాన్యం ఈ విషయాన్ని దాచిపెట్టాలని చూస్తోంది' అని అదనపు డీజీపీ అశోక్ కుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
ఆమె గర్భం దాల్చకుండా ఉండటానికి స్కూల్ యాజమాన్యం మందులు కలిపిన పానీయం ఇస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
స్కూల్‌లో 12 వ తరగతి చదువుతున్న ముగ్గురు- నలుగురు పేర్లను బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అత్యాచార విషయం తెలిసిన వెంటనే బాధితురాలి కుటుంబం పోలీసులు, పిల్లల సంక్షేమ అధికారులతో కలిసి పాఠశాలకు వెళ్ళింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు అందించారు. పోలీసులు స్కూల్ యాజమాన్యం, హాస్టల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
Uttarakhand: A class-10 student of a Dehradun school was allegedly gang-raped in school last month. ADG Law & Order says 'It's a month-old incident&has come to light only now. School had tried to hide the matter. All 9 accused - 5 staff&4 students arrested. Action will be taken.' pic.twitter.com/BJJQGi7sDF
— ANI (@ANI) September 18, 2018