World Cup 2023: ఇండియా ఆతిధ్యంతో 45 రోజులుగా సాగిన మెగా టోర్నీ ముగిసింది. మూడోసారి కప్ సాధిద్దామన్న టీమ్ ఇండియా కల చెదిరిపోయింది. మరోసారి ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయింది. ఐసీసీ ఈవెంట్‌లో తనకు తిరుగులేదని ఆసీస్ నిరూపించింది. కానీ ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది.
ప్రపంచకప్ 2023 మెగా టోర్నీలో భారీ స్కోర్ ఛేజింగ్ రికార్డు పాకిస్తాన్ సృష్టించింది. శ్రీలంక చేసిన 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్‌లో భారీ ఛేజింగ్ రికార్డు నెలకొల్పింది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఓడించి సంచలనం రేపింది. అటు పాకిస్తాన్ జట్టును సైతం ఓడించి క్రికెట్‌లో పసికూన కాదని నిరూపించడమే కాకుండా సెమీస్ రేసులో చివరి వరకూ నిలిచింది.
ప్రపంచకప్ 2023 ప్రారంభమైన రెండ్రోజుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీతో రికార్డు సృష్టించాడు. అటు సఫారీ జట్టు 428 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వన్డే ప్రపంచకప్ టోర్నీలో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రికార్డు సృష్టించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 388 పరుగులు చేయగా కివీస్ సైతం 383 పరుగులు చేసింది. అంటే మొత్తం రెండు జట్లు కలిపి 771 పరుగులు అత్యధిక పరుగులు నమోదయ్యాయి.
టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమీ ఈ టోర్నీలో మ్యాజిక్ చేశాడు. మూడు సార్లు 5 వికెట్ల హాల్ నమోదు చేయడమే కాకుండా మూడోసారి కివీస్‌పై ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో సెమీస్ చేరిన తొలిజట్టు ఇండియానే.
146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో నిబంధన ఎప్పట్నించో ఉన్నా ఎప్పుడూ జరగని అరుదైన ఘట్టం జరిగింది. క్రికెట్ చరిత్రలోనే తొలి టైమ్డ్ అవుట్ చోటుచేసుకుంది. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు మాధ్యూస్ 2 నిమిషాల్లోగా స్ట్రైక్ తీసుకోకపోవడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్ మేరకు టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు.
వన్డేల్లో 49 సెంచరీల సచిన్ రికార్డు సమం కావడం, ఆ తరువాత బ్రేక్ కావడం రెండూ జరిగాయి. కివీస్‌తో జరిగిన సెమీస్ పోరులో 50వ సెంచరీ సాధించి అత్యధిక వన్డే సెంచరీల సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు.
ఇక ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. ఆఫ్ఘన్ విధించిన 292 పరుగుల లక్ష్యం ఛేధించలేక 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో మ్యాక్స్‌వెల్ ఒక్కడే నిలబడిపోయిన 128 బంతుల్లో డబుల్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.
Also read: Ind vs Aus T20 Series: నవంబర్ 23 నుంచి ఆసీస్‌తో టీ20 సిరీస్, పూర్తి షెడ్యూల్, టీమ్ వివరాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
World Cup 2023: ప్రపంచకప్ 2023 మెగా టోర్నీలో అద్భుత ఘట్టాలు, అరుదైన ప్రపంచ రికార్డుల